AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమానవీయమైన ఘటన.. మూగజీవిపై పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు.. చివరకు ఏం జరిగిందంటే..

మానవత్వం మంట కలిసింది.. మాటలు నేర్చిన మనిషే తప్పులు చేస్తుంటే మాటలు రాని మూగజీవాలు తప్పులు చేస్తున్నాయని వాటిని బంధించి, చావు దెబ్బలు కొట్టి పైగా పోలీస్ స్టేషన్‎లో నిర్బంధించిన ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన అట్టెం మధు అనే వ్యక్తికి చెందిన ఎద్దు కత్తెరసాల గ్రామంలో ఓ పంట చేనులో మేసింది.

Viral Video: అమానవీయమైన ఘటన.. మూగజీవిపై పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు.. చివరకు ఏం జరిగిందంటే..
A Bull Has Arrest
Naresh Gollana
| Edited By: |

Updated on: Dec 13, 2023 | 10:28 AM

Share

మానవత్వం మంట కలిసింది.. మాటలు నేర్చిన మనిషే తప్పులు చేస్తుంటే మాటలు రాని మూగజీవాలు తప్పులు చేస్తున్నాయని వాటిని బంధించి, చావు దెబ్బలు కొట్టి పైగా పోలీస్ స్టేషన్‎లో నిర్బంధించిన ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన అట్టెం మధు అనే వ్యక్తికి చెందిన ఎద్దు కత్తెరసాల గ్రామంలో ఓ పంట చేనులో మేసింది. ఆ పంట యజమాని అయిన సర్ధార్ ఎద్దుని బందించి చావు దెబ్బలు కొట్టాడు. అక్కడితో ఆగకుండా ఇంట్లోనే నిర్బందించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎద్దు యజమాని మధు.. సర్దార్‎తో గొడవకు దిగారు. మూగ జీవిని ఎలా బందించి కొడుతావ్ అంటూ నిలదీశాడు. నా పంట చేనును పాడు చేసిన ఎద్దును కొట్టక ముద్దు పెట్టుకోవాలా.. ఎక్కువ తక్కువ అయితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో అన్నంత పని చేసేలా ఉన్నాడంటూ ఎద్దును విడిపించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు మధు.

పొలం యజమాని సర్దార్ సైతం త‌న పంట నష్టపోయానని.. పంట చేనులో మేసిన ఎద్దుపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు‌ చేశాడు. అక్కడితో ఆగకుండా న్యాయం జరిగేంత వరకు ఎద్దును‌ వదిలి పెట్టేదే లేదంటూ.. పోలీస్ స్టేషన్‎లో ఎద్దును అప్పగించాడు పొలం యజమాని సర్దార్. ఎద్దు పంచాయితీని ఎటు తేల్చలేక పోలీస్ స్టేషన్‎లోనే నిర్బందించారు పోలీస్ సిబ్బంది. అయితే ఎద్దును పోలీస్ స్టేషన్‎లో కట్టేయడంతో వివాదస్పద మైంది. ఎద్దును అరెస్ట్ చేశారంట అని స్థానికులు చర్చించుకోవడంతో అలర్ట్ అయిన పోలీసులు అర్థరాత్రి ఎద్దును యజమాని మధుకు అప్పగించారు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఎద్దు పంచాయితీని పెద్దల సమక్షంలో తేల్చుకోవాలంటూ సూచించడంతో పంచాయితీ మరో మలుపు తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
అప్పుడు వద్దన్నాడు.. తర్వాత హీరోగా సినిమా తీశాడు..
అప్పుడు వద్దన్నాడు.. తర్వాత హీరోగా సినిమా తీశాడు..
వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త
వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త