AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం, మద్యం మత్తులో ఉన్న భర్త శ్యామలపై కత్తితో దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న భర్త అరాచకం
Huzurabad News
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 02, 2026 | 6:49 PM

Share

భార్యపై అనుమానంతో మద్యం మత్తులో కత్తి తో దాడి చేశాడు ఓ కిరాతక భర్త. తీవ్ర గాయాలతో ఉన్న భార్య శ్యామలను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి – శేఖరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు. శేఖరయ్య ముప్పై సంవత్సరాల క్రితం చనిపోగా పెద్ద కూతురు అరుణను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన వృత్తిరీత్యా టైలర్‌గా పనిచేస్తున్న సతీష్‌కు ఇచ్చి వివాహం చేసింది లక్మి.

ఆ తర్వాత వారికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఈ క్రమంలో భార్య అరుణ చిన్న చెల్లెలు శ్యామలను తనకు ఇచ్చి వివాహం చేయాలని సతీష్ వేధించాడు. భర్త మృతి చెందడం నలుగురు కూతుళ్ల భారం.. మరో వైపు అల్లుడు వేధింపులు భరించలేని లక్మీ.. చిన్న కూతురు శ్యామలను సతీష్‌కు ఇచ్చి వివాహం చేసింది. అనంతరం పెద్ద భార్య అరుణను ఇంటి నుండి వెళ్లగొట్టడంతో ఇద్దరు కూతుళ్ళతో తల్లి ఇంటి వద్దే ఉంటుంది అరుణ. ఇక, శ్యామలకు ఇద్దరు కూతుళ్లు పుట్టిన అనంతరం నిత్యం మద్యం సేవించి వేధించడం మొదలు పెట్టాడు సతీష్. అంతేగాక, శ్యామల కూలి పని చేసి సంపాదించిన డబ్బులు ఇవ్వమని వేధించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అయితే నేడు తెల్లవారుజామున భార్య శ్యామలతో గొడవపడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
మీరు కొనే జీడిపప్పు అసలైనదేనా.. కల్తీ కాజును సెకన్లలో ఇలా..
మీరు కొనే జీడిపప్పు అసలైనదేనా.. కల్తీ కాజును సెకన్లలో ఇలా..
మెదడుకు ఈ డ్రై ఫ్రూట్ సూపర్ ఫుడ్ అంటున్నారు.. రోజుకు 2-3 చాలు!
మెదడుకు ఈ డ్రై ఫ్రూట్ సూపర్ ఫుడ్ అంటున్నారు.. రోజుకు 2-3 చాలు!
టైల్స్ మధ్య పేరుకుపోయిన మురికిని వదిలించాలా? సింపుల్ చిట్కాలు
టైల్స్ మధ్య పేరుకుపోయిన మురికిని వదిలించాలా? సింపుల్ చిట్కాలు
పిజ్జా తినాలనిపిస్తోందా? మైదా వద్దు.. రవ్వతో ఇలా చేసేయండి!
పిజ్జా తినాలనిపిస్తోందా? మైదా వద్దు.. రవ్వతో ఇలా చేసేయండి!
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‏లకు ఆమె లక్కీ హీరోయిన్..
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్‏లకు ఆమె లక్కీ హీరోయిన్..
వంటింట్లో ఉండే బేకింగ్ సోడా.. ఇన్ని పనులు చేస్తుందా?
వంటింట్లో ఉండే బేకింగ్ సోడా.. ఇన్ని పనులు చేస్తుందా?
వ్యూస్, లైక్స్ అక్కర్లేదు.. నాకు ట్రోఫీలే కావాలి: గంభీర్
వ్యూస్, లైక్స్ అక్కర్లేదు.. నాకు ట్రోఫీలే కావాలి: గంభీర్
2027లో ఎండలు కాదు.. ఏకంగా అగ్ని వర్షమే! 'ఎల్ నినో' వార్నింగ్
2027లో ఎండలు కాదు.. ఏకంగా అగ్ని వర్షమే! 'ఎల్ నినో' వార్నింగ్
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో తెలంగాణ భాగస్వామ్యం..!
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో తెలంగాణ భాగస్వామ్యం..!
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మ..
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మ..