రకుల్ అందాల సోయగాలు.. రెడ్ డ్రెస్‌లో అదిరిపోయిందిగా..
Samatha
22 August 2026
టాలీవుడ్ స్టార్ బ్యూటీ, అందాల చిన్నది రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దు అందానికి హద్దే ఉండదు.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న ఈ చిన్నది తర్వాత నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అంతే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గ మారిపోయింది.
ఇక రారండోయ్ వేడుక చూద్దా, స్పైడర్ వంటి సినిమాల్లో నటించి, కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉండగానే ఈ బ్యూటీ బాలీవుడ్ చక్కేసింది.
అక్కడ కూడా వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేసింది. ముఖ్యంగా దేదే ప్యార్ దే, ఇండియన్ టూ, అయలాన్ ఇలా హిందీలో కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
తర్వాత బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమ వివాహం చేసుకుంది. అంతే కాకుండా పెళ్లి తర్వాత సినిమాలు, బిజినెస్‌లు చూసుకుంటూ బిజీగా గడిపేస్తుంది.
రీసెంట్‌గా ఈ బ్యూటీ బాలీవుడ్ రామాయణంలో సూర్పనక పాత్రలో కనిపించింది. మూవీ ట్రైలర్‌లో తన నటనతో అదరగొట్టిందనే చెప్పాలి.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ రెడ్ కలర్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి.