AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: ఆపదలో అండగా.. పేద విద్యార్థిని డాక్టర్ కలకు ఊపిరిపోసిన ఎమ్మెల్యే హరీష్ రావు!

రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడంలో తన మార్క్ చాటుకుంటున్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. నాలుగేళ్ల క్రితం తండ్రిని కోల్పోయి చదువు ఆగిపోయే పరిస్థితిలో ఉన్న సిద్దిపేట చిన్నారి అఖిలకు అండగా నిలిచిన ఆయన తాజాగా ఆమె నీట్‌లో మంచి మార్కులు సాధించడంతో ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఆమె ఎంబీబీఎస్ చదువుకయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నారు.

Harish Rao: ఆపదలో అండగా.. పేద విద్యార్థిని డాక్టర్ కలకు ఊపిరిపోసిన ఎమ్మెల్యే హరీష్ రావు!
Harish Rao Support To Neet Qualified Student
P Shivteja
| Edited By: |

Updated on: Aug 02, 2026 | 7:25 PM

Share

రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తండ్రి లేని పేద విద్యార్థిని అఖిల అనే యువతికి విద్యాదాతగా నిలిచి,ఆమె డాక్టర్ కల నిజం చేసేందుకు నేనున్నానంటూ అభయమిచ్చారు. అఖిల కుటుంబ సభ్యులను తన నివాసానికి ఆహ్వానించి, వారితో కలిసి భోజనం చేసి ధైర్యం చెప్పారు హరీష్ రావు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన అఖిల అనే విద్యార్థిని తండ్రి నాలుగేళ్ల క్రితం మరణించారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. చదువు ఆగిపోయే పరిస్థితిలో ఉన్న ఆ బాలికకు అప్పట్లోనే మాజీ మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అఖిల చదువుకు అయ్యే ఖర్చులను ఆయనే భరించారు. హరీష్ రావు ఇచ్చిన ప్రోత్సాహంతో అఖిల కష్టపడి చదివి.. ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో 453 మార్కులతో అద్భుత ప్రతిభ కనబరిచింది.

అఖిలకు మంచి మార్కులు వచ్చిన విషయం తెలుసుకున్న హరీష్ రావు.. వెంటనే ఆమెను, ఆమె తల్లి రేణుకను హైదరాబాద్‌లోని తన నివాసానికి ఆహ్వానించారు. తన ఇంటికి వచ్చిన అఖిల కుటుంబ సభ్యులతో హరీష్ రావు ఆత్మీయంగా మాట్లాడారు. వారికి స్వయంగా భోజనం వడ్డించి.. వారితో కలిసి భోజనం చేశారు. అఖిలా.. నీకు ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వచ్చినా సరే.. మెడిసిన్ చదివించే పూర్తి బాధ్యత నాది.. ఫీజులు మొత్తం నేనే భరిస్తా అంటూ కొండంత భరోసానిచ్చారు హరీష్ రావు. కష్టపడి చదివి డాక్టర్ అయి నలుగురికి సేవ చేచాలని ఆశీర్వదించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us