AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులా..? కాదా..? ఆధార్ నెంబర్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా..

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం షురూ చేసింది. హైదరాబాద్‌లో ఇళ్లను త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం తేదీని కూడా ఖరారు చేసింది. అయితే దరఖాస్తు చేసుకున్నవారు మీరు అర్హులా..? కాదా? అనేది సులువుగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే..

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులా..? కాదా..? ఆధార్ నెంబర్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా..
Indiramma Houses
Venkatrao Lella
|

Updated on: Aug 21, 2026 | 11:20 AM

Share

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులా..? కాదా? అనేది తెలుసుకునేందుకు ఒక వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా సులువుగా మీ అర్హతను తెలుసుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డు లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల మీ స్టేటస్ సెకన్లలోనే స్క్రీన్‌పై కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. త్వరలో మంజూరు చేయనున్నారు. లాటరీ పద్దతి ద్వారా అధికారులు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నారు. తొలి విడతలో 7640 ఇళ్లను మంజూరు చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులు ఎవరు..? అనర్హులు ఎవరు? అనేది ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. మీ స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే..?

మీరు అర్హులో.. కాదో ఎలా తెలుసుకోవాలి..?

-https://tghb.telangana.gov.in/curestatus పోర్టల్‌లోకి వెళ్లండి

-ఆధార్, మొబైల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్లలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోండి

-ఆ తర్వాత నెంబర్ నమోదు చేయండి

-అనంతరం సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-మీ అప్లికేషన్ నెంబర్, పేరు, ఏ నియోజకవర్గం, స్టేటస్ వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి

-అర్హత సాధిస్తే ఎలిజిబుల్ అని కనిపిస్తుంది

-అనర్హులైతే ఇన్‌ఎల్జిబుల్ అని చూపిస్తుంది

-ఇన్‌ఎల్జిబుల్ అయితే పక్కన రైజ్ క్లెయిమ్ ఆనే ఆప్షన్ కనిపిస్తుంది

-రైజ్ క్లెయిమ్‌పై క్లిక్ చేస్తే ఎందుకు అనర్హులు అనే వివరాలు కనిపిస్తాయి

-అనంతరం ఎవిడెన్స్ కాలమ్‌లో మీ పేరుపై భూమి లేదా ఇల్లు ఉండటం లేదా ఇతర కారణాల వల్ల అనర్హులుగా తేల్చినట్లు కారణం చూపిస్తుంది

-ఆ వివరాలు తప్పు అయితే మీరు కారణాలు బాక్సులో రాయాలి. ధృవపత్రాలు అప్ లోడ్ చేయాలి

అర్హతలు ఏంటి..?

-దరఖాస్తుదారుడు పదేళ్లుగా హైదరాబాద్ పరిధిలో నివసిస్తూ ఉండాలి

-దరఖాస్తుదారుడి పేరుతో రాష్ట్రంలో ఇతర చోట్ల సొంత భూమి ఉంటే అనర్హులు

-ఒక దరఖాస్తుదారుడు ఏదైనా భూమిని విక్రయించా అతని దగ్గర డబ్బు ఉందని పరిగణించి అనర్హులుగా తేలుస్తారు

-ఇక సొంతగా వాహనాలు కలిగి ఉంటే అనర్హులు

-ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, గతంలో లబ్దిపొందినవారు, సొంత ఇల్లు ఉన్నవారు అనర్హులు

40 వేల మంది అనర్హులు

మొత్తం 60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 40 వేల మందిని అనర్హులుగా గుర్తించారు. అనర్హుల నుంచి ఈ నెల 23వ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 25న అసలు లబ్దిదారుల జాబితా విడుదల చేస్తారు. 27వ తేదీ నుంచి 30 వరకు లాటరీ తీసి లబ్దిదారులను ఎంపిక చేస్తారు.

Follow Us