AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రూ.10 లక్షలతో బయటకెళ్లాడు.. కట్ చేస్తే, చెరువు కట్టపై అలా..

హైదరాబాద్‌ శివార్లలో వ్యాపారి నేమారం చౌదరి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి రూ.10 లక్షల నగదుతో వెళ్లిన ఆయన.. మేడ్చల్‌ పరిధిలోని మురహరిపల్లి చెరువు కట్టపై మృతదేహంగా కనిపించారు. నగదు ఏమైంది? చివరిసారిగా ఎవరిని కలిశారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: రూ.10 లక్షలతో బయటకెళ్లాడు.. కట్ చేస్తే, చెరువు కట్టపై అలా..
Medchal Businessman Death
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 05, 2026 | 9:40 AM

Share

హైదరాబాద్‌ శివార్లలో ఓ వ్యాపారి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఇంటి నుంచి సుమారు రూ.10 లక్షల నగదుతో బయటకు వెళ్లిన వ్యక్తి.. రెండు రోజుల తర్వాత చెరువు కట్టపై శవమై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆయనకు ఏం జరిగింది? డబ్బు ఎక్కడ ఉంది? చివరిసారిగా ఆయన ఎవరిని కలిశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మురహరిపల్లి చెరువు కట్టపై ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. మృతుడు నేమరం చౌదరి(55)గా గుర్తించారు.

రెండు రోజులుగా కనిపించకుండా..

నేమారం చౌదరి గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన చౌదరి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చౌదరి ఇంటి నుంచి వెళ్లే సమయంలో 10 లక్షల రూపాయల నగదు తీసుకెళ్లినట్టు కుటుంబసభ్యులు చెప్తున్నారు. తమకు వచ్చిన సమాచారంతో మురహరిపల్లి చెరువు కట్టపై డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే.. ఇంటి నుంచి వెళ్తున్న సమయంలో తీసుకెళ్లిన నగదు ఏమైంది అనేది మిస్టరీగా మారింది. నేమారం చౌదరికి భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు.

చెరువు కట్టపైకి ఎందుకు వెళ్లారు?

నేమారం చౌదరి.. చెరువు కట్టపైకి ఎందుకు వెళ్లారనేది ప్రశ్నార్థకంగా మారింది. నేమారం చౌదరి ఫోన్‌ కాల్స్‌, చివరిసారిగా ఎవరితో మాట్లాడారు, ఆయన కదలికలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, ఫోన్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us