AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీకి కృత్రిమ నీటి‌ కొరత.. ఎల్‌నీనో కాదు.. అసలు కారణం ఇదేనట!

నీటి కొరత కారణంగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు దసరా సెలవులు పొగడించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నీటి కొరతకు అధికారులు ఎల్‌నీనోను కారణంగా చూపగా అసలు కారణం వేరే అని తాజాగా తేలింది. ఈ కొరతకు అసలైన కారణంగా మిషన్ భగీరథ మోటార్ల మరమ్మతులో అధికారుల నిర్లక్ష్యమే అని తేలింది.

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీకి కృత్రిమ నీటి‌ కొరత.. ఎల్‌నీనో కాదు.. అసలు కారణం ఇదేనట!
Basara Triple It Water Crisis
Naresh Gollana
| Edited By: |

Updated on: Oct 25, 2026 | 11:35 AM

Share

బాసర ట్రిపుల్ ఐటీని తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఎల్ నినో ఎఫెక్ట్ తోనే ట్రిపుల్ ఐటీ కి దసరా సెలవులు పొడగిస్తున్నాం.. ఈనెల 17 వరకు దసరా సెలవులు కొనసాగుతాయి.. అప్పటి వరకు అకాడమిక్ ఈయర్ లాస్ కాకుండా వెంటనే ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నామంటూ బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం సర్కిల్ జారీ చేసింది. యూనివర్సిటీలో 9 వేల మంది విద్యార్థులు, 3 వేల మంది సిబ్బందికి రోజు 25 లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా కేవలం 10 లక్షల లీటర్ల నీరు మాత్రమే సరపరా ఉందంటూ.. తప్పని పరిస్థితులు దసరా సెలవులను పొడగిస్తున్నామంటూ‌ స్పష్టం చేసింది బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం.

సీన్ కట్ చేస్తే ఇదంతా మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వచ్చి‌న కృతిమ నీటి కొరత అని తేలింది. మూడు నెలల క్రితం బాసర ట్రిపుల్ ఐటీకి గోదావరి నుండి నీటి సరపరా చేసే ఇన్ టెక్ వెల్ మోటర్లు పాడవగా.. వాటిని మరమ్మత్తు చేయించడంలో మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం వహించిన కారణంగానే బాసర ట్రిపుల్ ఐటీకి నీటి సరపరా నిలిచిపోయిందని తేలింది. ఇన్ టెక్ వెల్ వద్ద మూడు మోటర్లు పని చేయాల్సి ఉండగా ఒకే ఒక్క మోటర్ తో నీటి సరపరా సాగుతుంది. ఈ ఎఫెక్ట్ తో ట్రిపుల్ ఐటీలో హస్టల్లు మూతపడ్డ పరిస్థితి ఏర్పడింది.

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కృత్రిమ నీటి కొరత విద్యార్థులకు చదువుల కష్టాలను మోసుకొచ్చింది. మూడు నెలల క్రితం గోదావరి ఒడ్డున ఉన్న సంపులో మూడు మోటార్లు చెడి పోగా.. అక్కడి నుంచే ఆర్జీయూకేటీ ( బాసర ట్రిపుల్ ఐటీ ) లో నీటి నిల్వ కోసం నిర్మించిన చెరువుకు గోదావరి నీటిని తరలిస్తున్నారు. వాటిని వెంటనే మరమ్మతు చేయించాల్సిన సంబంధిత మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో బాసర‌ట్రిపుల్ ఐటీకి నీటి సరఫరా నిలుచి పోయింది. ఫలితం బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులను పొడగించారు అదికారులు. వాస్తవానికి అన్ని యూనివర్సిటీల కంటే ముందే అక్టోబరు 10 నుంచి 21 వరకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు దసరా సెలవుల ను ప్రకటించింది బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం. సెలవులు ముగియడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి క్యాంపస్ కు వస్తే నీటి కష్టాలు తలెత్తుతాయని భావించిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం హుటాహుటిన ఒక మోటారుకు మరమ్మతు చేయించింది.ఆ ఒక్క మోటర్ తోనే నీటిని సరఫరా చేస్తున్నారు.

ఈ ఒక్క మోటర్ తోనే విశ్వవిద్యాలయంలోని చెరువు నిండాలంటే సుమారు పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని మిషన్ భగీరథ సిబ్బంది తెలుపడంతో ఎల్ నినో బూచి చూపుతూ దసరా సెలవులను పొడగించింది బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం. దీనికి తోడు విశ్వవిద్యాలయంలో కరెంట్ కష్టాలు తలెత్తడంతో ఎల్ నినో ఎఫెక్ట్ పేరుతో దసరా సెలవులను నవంబర్ 17 వరకు పొడగించింది ట్రిపుల్ ఐటీ యాజమాన్యం. దసరా సెలవుల్లోనే ఇన్ టెక్ వెల్ వద్ద పాడైన మోటార్లకు మరమ్మతులు చేయిస్తే ఈ సమస్య వచ్చేది కాదంటున్నారు బాసర స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం తో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆన్ లైన్ చదువులు తప్పడం‌ లేదు.

బాసర ఆర్జీయూకేటీలో దాదాపు 9 వేల మంది విద్యార్థులు, 3 వేల మంది ఉద్యోగులు ఉంటారు. రోజుకు వీరందరి అవసరాలకు 25 లక్షల లీటర్ల నీరు అవసరం. మిషన్ భగీరథ మోటర్లు పాడవడంతో బాసర గోదావరి నది నుంచి ప్రతిరోజూ అవసరమైన నీటిలో 10 లక్షల లీటర్ల నీరు మాత్రమే వర్సిటీ ప్రాంగణంలోని 27 ఎకరాల రిజర్వాయర్కు చేరుతోంది. ట్రిపుల్ ఐటీలో 30 బోర్లు ఉండగా.. బోర్వెల్స్ అడుగంటడంతో నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. ఫలితంగా దసరా సెలవులను పొడిగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్లో తరగతులు ప్రారంభిస్తున్నామని.. అధికారులు శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. నవంబరు 17 వరకు సిలబస్ పూర్తిచేయాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందులో భాగంగా పీయూసీ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు నవంబరు 10, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం విద్యార్థులందరూ నవంబరు 18న రిపోర్టు చేయాలని వర్సిటీ సూచించింది.

పీయూసీ నుంచి ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులందరికీ నవంబరు 19-21 వరకు ఆబ్జెక్టివ్ పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్ మొదటి, రెండవ సంవత్సరం బ్యాచ్లకు ప్రయోగ పరీక్షలు నవంబరు 23-28 వరకు, థియరీ పరీక్షలు నవంబరు 29 నుంచి డిసెంబరు 6 వరకు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ మూడు, నాలుగో సంవత్సరం బ్యాచ్ లకు థియరీ పరీక్షలు నవంబరు 23-29 వరకు, ప్రయోగ పరీక్షలు నవంబరు 30 నుంచి డిసెంబరు 3 వరకు నిర్వహిస్తారు. పీయూసీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు నవంబరు 23 నుంచి డిసెంబరు 6 వరకు జరగనున్నాయి. రిమిడియల్ పరీక్షలు బీ22, బీ23, బీ24 బ్యాచ్లకు అక్టోబరు 27 నుంచి నవంబరు 11 వరకు, ఇంజినీరింగ్ సెమిస్టర్ 2 రిమిడియల్స్ నవంబరు 10-18 వరకు, మిగిలిన పెండింగ్ పీయూసీ మొదటి, రెండో సంవత్సరం రిమిడియల్ పరీక్షలు డిసెంబరు 7 నుంచి ప్రారంభమవుతాయన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us