యద్ధం ఇంకా ముగియలేదు.. 9/11 తరహా దాడులు మళ్లీ జరుగుతాయి.. అల్-ఖైదా సంచలన ప్రకటన!
సెప్టెంబర్ 30న జరిగిన ప్లైదుబాయ్ విమాన ఘటన తర్వాత.. తాజాగా ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా సంచలన ప్రకటన వెలువరించింది. ఇస్లాం వ్యతిరేకులు, ముఖ్యంగా అమెరికన్లు, ఇజ్రాయెలీలు ప్రయాణించే విమానాలనే టార్గెట్‌గా రాబోయే రోజుల్లో దాడుగు జరుగుతున్నాయని పేర్కొంది. 2001 నాటి 9/11 న్యూయార్క్ ఉగ్రదాడుల తరహాలోనే ఈ దాడులు కూడా ఉంటాయని స్పష్టం చేసింది.

ప్లైదుబాయ్ ఇన్సిడెంట్ జరిగన సరిగ్గా 5 రోజులకు ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా నుంచి సంచలన ప్రకటన వెలువడింది. ముస్లిం వ్యతిరేకులు, అమెరికన్లు, ఇజ్రాయెలీలు ట్రావెల్ చేసే విమానాలే టార్గెట్‌గా దాడులకు పాల్పడాలని పిలుపునిచ్చింది. ప్లైదుబాయ్ సహా 2001 నాటి 9/11 న్యూయార్క్ తరహాలో రాబోయే రోజుల్లో దాడు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చింది. ఇండియా టుడే కథనం ప్రకారం.. అల్-ఖైదా సానుభూతిపరులు రన్ చేస్తున్న అల్-బయాన్’ అనే వీక్లీ పత్రికలో ప్రకటన పబ్లీష్ అయింది. అయితే ఈ వార్నింగ్‌ను టెలిగ్రామ్ గ్రూపుల్లో తెగవైరల్ చేసిన తర్వాత డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.
యుద్ధం ఇంకా ముగియలేదు- అల్-ఖైదా
అల్-బయాన్ అనే వీక్లీ పేపర్‌లో వెలువడిన ప్రకటనలో 9/11 నాటి న్యూయార్క్ ట్విన్ టవర్స్‌ను విమానాలు ఢీకొట్టిన దృశ్యాలను, ఫ్లైదుబాయ్ ఘటన తాలూకు ఫొటోలను వేసి.. యుద్ధం ఇంకా ముగియలేదు. జియోనిస్టులు, అమెరికన్లు, ఇస్లాంకు వ్యతిరేకంగా పొరాటే వారు ప్రయాణిస్తున్న విమానాలు ఇంకా గాల్లోనే ఎగురుతున్నాయి. సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 30న జరిగిన విదంగానే వాటిని కూడా టార్గెట్‌గా దాడులు జరగొచ్చని పేర్కొంది. గతంలో కంటే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌లకు శత్రువులు పెరిగారని, త్వరలోనే అమెరికా అంతమవుతుందని రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ ప్రయత్నించిన ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. యూఏఈ కస్టడీలో ఉన్న అతనికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే అతని సోషల్ మీడియా ఖాతాల్లో ఒసామా బిన్ లాడెన్, అయ్మన్ అల్-జవాహిరి వంటి అల్-ఖైదా అగ్రనేతలకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
