AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

90 ఏళ్ల జపాన్‌ తాత బాడీబిల్డింగ్‌.. రోజూ ఏం తింటాడో తెలుసా?

90 ఏళ్ల వయసులోనూ జపాన్‌కు చెందిన బాడీబిల్డర్‌ తోషిసుకే కనజావా తన ఫిట్‌నెస్‌ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 90వ పుట్టినరోజు తర్వాతే జరిగిన పోటీలో 85 ఏళ్లు పైబడిన విభాగంలో విజేతగా నిలిచి 19వ జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మాంసం, చేపలు తీసుకోకుండా బ్రౌన్‌ రైస్‌, నట్టో, మిసో సూప్‌, ప్రొటీన్‌ సప్లిమెంట్లతో కూడిన ఆహారాన్ని ఆయన పాటిస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు..

90 ఏళ్ల జపాన్‌ తాత బాడీబిల్డింగ్‌.. రోజూ ఏం తింటాడో తెలుసా?
90 Year Old Japanese Bodybuilder
Srilakshmi C
|

Updated on: Oct 05, 2026 | 11:22 AM

Share

90 ఏళ్ల వయసులోనూ బరువులు ఎత్తుతూ.. బాడీబిల్డింగ్‌ పోటీల్లో పాల్గొంటూ.. మరో ప్రపంచ స్థాయి విజయంపై కన్నేశారు జపాన్‌కు చెందిన తోషిసుకే కనజావా. హిరోషిమాకు చెందిన ఆయన ఇటీవల తన 90వ పుట్టినరోజు తర్వాతి రోజే జరిగిన All Japan Masters Fitness Championshipsలో 85 ఏళ్లు పైబడిన విభాగంలో విజేతగా నిలిచారు. ఇది ఆయనకు జాతీయ స్థాయిలో సాధించిన 19వ టైటిల్‌ కావడం విశేషం. అయితే కనజావా ఫిట్‌నెస్‌ ప్రయాణం ఎంత ఆసక్తికరంగా ఉందో.. ఆయన ఆహారపు అలవాట్లు కూడా అంతే ప్రత్యేకంగా ఉన్నాయి. CNNకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. మాంసం, చేపలను పూర్తిగా దూరంగా ఉంచుతారు. 50 ఏళ్ల వయసులో తిరిగి బాడీబిల్డింగ్‌ ప్రారంభించినప్పటి నుంచి కఠినమైన శాకాహార ఆహారాన్ని అనుసరిస్తున్నారు. ఆయన ఆహారంలో ప్రధానంగా బ్రౌన్‌ రైస్‌, నట్టో (పులియబెట్టిన సోయాబీన్స్‌), మిసో సూప్‌ ఉంటాయి. వీటితో పాటు రోజుకు మూడుసార్లు ప్రొటీన్‌ సప్లిమెంట్స్‌ తీసుకుంటారు.

90 ఏళ్ల వయసులో ఈ డైట్‌ ఆరోగ్యకరమేనా?

ఉదయం అల్పాహారంగా బ్రౌన్‌ రైస్‌, నట్టో, మిసో సూప్‌ తీసుకుంటారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో సాధారణంగా బ్రౌన్‌ రైస్‌కు కొద్దిగా ఫురికాకే (జపనీస్‌ మసాలా మిశ్రమం) కలుపుకుని తింటారు. రోజులో మూడు సార్లు ప్రొటీన్‌ డ్రింక్‌ తీసుకోవడం ఆయన డైట్‌లో ముఖ్యమైన భాగం. కనజావా పాటిస్తున్న ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన అంశాలు ఉన్నాయని ISIC మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ చీఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌ హిమాంశి శర్మ తెలిపారు. బ్రౌన్‌ రైస్‌లో కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌ ఉంటాయి. నట్టో, మిసో వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలను అందిస్తాయి. అలాగే వృద్ధాప్యంలో కండరాల బలం, కండర ద్రవ్యరాశిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని.. అందుకు తగినంత ప్రొటీన్‌ తీసుకోవడం ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే కనజావాకు ఈ డైట్‌ సరిపోయిందని ప్రతి ఒక్కరికీ ఇదే ఆహారం సరిపోతుందని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పండ్లు, కూరగాయలు కూడా అవసరమే..

కనజావా డైట్‌లో ఆరోగ్యకరమైన పదార్థాలు ఉన్నప్పటికీ.. ఆహారంలో వైవిధ్యం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, వివిధ సూక్ష్మ పోషకాలు తగినంతగా లభించకపోవచ్చని సూచిస్తున్నారు. అందువల్ల సాధారణంగా ప్రతి ఒక్కరూ వివిధ రకాల పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో సమతుల్యమైన డైట్‌ను పాటించడం మంచిదని చెబుతున్నారు. బ్రౌన్‌ రైస్‌, నట్టో, మిసో వంటి ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సహాయపడే ఆహారాల్లో భాగంగా పరిగణించవచ్చు. అయితే ఏ ఒక్క ఆహారం వృద్ధాప్యాన్ని ఆపదు లేదా తిరిగి యవ్వనాన్ని తీసుకురాదు. హోల్‌గ్రెయిన్స్‌, పులియబెట్టిన ఆహార పదార్థాలు శరీరంలో వాపును తగ్గించడంలో, గట్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. తగినంత ప్రొటీన్‌ తీసుకోవడం వృద్ధాప్యంలో కండరాల బలం, శారీరక సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఆహారం ఒక్కటే కారణం కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర, ఒత్తిడిని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అంతే కీలకమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

భార్య కోసం మళ్లీ బాడీబిల్డింగ్‌ ప్రారంభం

కనజావా బాడీబిల్డింగ్‌ ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరమైనది. ఆయన 34 ఏళ్ల వయసులో బాడీబిల్డింగ్‌కు స్వస్తి చెప్పినా.. 50 ఏళ్ల వయసులో తిరిగి ఈ రంగంలోకి అడుగుపెట్టారు. తన భార్య అనారోగ్యానికి గురైన సమయంలో ఆమెను ఉత్సాహపరిచేందుకు పోటీల్లో పాల్గొనడం ప్రారంభించినట్లు ఆయన గతంలో వెల్లడించారు. ఆమె మరణించినప్పటికీ.. కనజావా మాత్రం తన బాడీబిల్డింగ్‌ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ పోటీల్లో పాల్గొంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కనజావా మరో లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 60 ఏళ్లు పైబడిన విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాలని ఆయన కోరుకుంటున్నారు. అంతేకాదు.. తన బాడీబిల్డింగ్‌ కెరీర్‌లో మరో కలను కూడా నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అదే ప్రముఖ బాడీబిల్డింగ్‌ దిగ్గజం ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌ను కలవడం. దశాబ్దాల క్రితం కనజావా Mr. Universe పోటీల్లో పాల్గొన్న సమయంలోనే ష్వార్జ్‌నెగర్‌ Mr. Olympia పోటీల్లో పాల్గొనేవారు. 90 ఏళ్ల వయసులోనూ పోటీల్లో పాల్గొంటున్న కనజావా.. ఇప్పుడు తన అభిమాన బాడీబిల్డింగ్‌ దిగ్గజాన్ని కలవాలనే కలతో ముందుకు సాగుతున్నారు.

Follow Us
90 ఏళ్ల జపాన్‌ తాత బాడీబిల్డింగ్‌.. రోజూ ఏం తింటాడో తెలుసా?
90 ఏళ్ల జపాన్‌ తాత బాడీబిల్డింగ్‌.. రోజూ ఏం తింటాడో తెలుసా?
సింగీతంతో చిరంజీవి సినిమా.. భూలోకవీరుడు ఎందుకు ఆగిపోయిందంటే.
సింగీతంతో చిరంజీవి సినిమా.. భూలోకవీరుడు ఎందుకు ఆగిపోయిందంటే.
మీ ఎమ్మెల్యే ఓటు.. రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటుంది..
మీ ఎమ్మెల్యే ఓటు.. రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటుంది..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
అంతపెద్ద భారీ దేహంతో ఇటెందుకొచ్చావ్ నాగన్నా..? భయంతో జనాలు గజగజ
అంతపెద్ద భారీ దేహంతో ఇటెందుకొచ్చావ్ నాగన్నా..? భయంతో జనాలు గజగజ
డాడీ సినిమాకు 25 ఏళ్లు.. పవన్, అల్లు అర్జున్ ఇద్దరికి స్పెషల్..
డాడీ సినిమాకు 25 ఏళ్లు.. పవన్, అల్లు అర్జున్ ఇద్దరికి స్పెషల్..
జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ
జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ
పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా
పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా
ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!
ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!
దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!
దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!