పంచాక్షరి మంత్రం ఎన్ని రకాలు? ‘నమశ్శివాయ’లో దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

October 05, 2026

Rajashekher

స్థూల పంచాక్షరి ‘నమశ్శివాయ’, సూక్ష్మ పంచాక్షరి ‘శివాయ నమః’, కారణ పంచాక్షరి ‘శివాయ శివ’, మహాకారణ పంచాక్షరి ‘శివాయ’, మహామను లేదా ముక్తి పంచాక్షరి ‘శి’గా పేర్కొంటారు.

పంచాక్షరి మంత్రాకి ఆరు రకాలు

అంటే నమస్కారం లేదా నమస్కరించడం. ‘శివాయ నమః’ అంటే శివభగవానునికి నమస్కారాలు అని అర్థం.

‘నమః’ అర్థం: ‘నమః’ 

దేహదృష్టితో చూసినప్పుడు జీవుడు శివుడికి సేవకుడిగా భావించబడతాడు. భక్తి, ఆధ్యాత్మిక దృష్టిలో శివుడిని పరమాత్మగా, జీవుడిని జీవాత్మగా భావిస్తారు.

జీవుడు–శివుడి సంబంధం

‘నమః’ జీవాత్మను, ‘శివ’ పరమాత్మను, ‘ఆయ’ జీవాత్మ–పరమాత్మల ఐక్యాన్ని సూచిస్తాయని ఆధ్యాత్మిక వివరణలో చెబుతారు.

‘నమః–శివ–ఆయ’ తాత్త్విక అర్థం

ఈ అర్థంలో ‘శివాయ నమః’ జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని సూచించే ‘తత్త్వమసి’ వంటి మహావాక్య భావాన్ని కలిగి ఉందని భావిస్తారు.

‘శివాయ నమః’ మహావాక్య భావన

ప్రణవం (ఓంకారం) భగవంతుని బాహ్యరూపమైన పొట్టులాంటిదైతే, పంచాక్షరి మంత్రం అంతఃస్వరూపమైన బియ్యపు గింజలాంటిదని ఆధ్యాత్మిక ఉపమానం చెబుతుంది. ఈ దృష్టిలో ప్రణవం, పంచాక్షరి పరస్పర సంబంధం కలిగినవిగా భావిస్తారు.

ప్రణవం–పంచాక్షరి సంబంధం

‘నమశ్శివాయ’లోని ఐదు అక్షరాలు భగవానుని సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనే ఐదు దివ్య కర్మలను సూచిస్తాయని చెబుతారు. 

ఐదు అక్షరాల అంతరార్థం

పంచాక్షరిలోని ఐదు అక్షరాలు పంచభూతాలు.. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశంతో అనుసంధానించబడతాయి. ఈ పంచభూతాల కలయికతో ఏర్పడిన సమస్త సృష్టి, జీవరాశులను కూడా ఇవి సూచిస్తాయని ఆధ్యాత్మిక సంప్రదాయంలో భావిస్తారు.

పంచభూతాలతో అనుసంధానం