AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి జారిపడిన ప్యాసింజర్.. రెప్పపాటులో కాపాడిన కానిస్టేబుల్!

అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో పడిపోయాడు. అది గమనించి వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో స్పందించి అతన్ని రక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి జారిపడిన ప్యాసింజర్.. రెప్పపాటులో కాపాడిన కానిస్టేబుల్!
Anantapur Railway Station
Anand T
|

Updated on: Oct 05, 2026 | 12:01 PM

Share

రన్నింగ్ ట్రైన్‌ను ఎక్కబోయి కిందపడిపోయిన ఓ ప్రయాణికుడిని ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో కాపాడిన ఘటన అనంతపురం రైల్వే స్టేషన్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా భైరవ నగర్‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి.. ఈ నెల 29వ తేదీన రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అతను స్టేషన్‌లో ఉండగానే.. ఆయన ఎక్కాల్సిన ట్రైన్ కదిలింది. అది గమనించిన రవికుమార్.. ట్రైన్ రన్నింగ్‌లో ఉండగానే ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు.

అయితే సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేంద్ర.. రవి పడిపోవడాన్ని గమనించి.. సమయస్ఫూర్తితో అతని చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. దీంతో రవికుమార్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం తనను కాపాడిన కానిస్టేబుల్‌‌కు రవికుమార్ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే అక్కడే ఉన్న ప్రయాణికులు సైతం కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని కొనియాడారు.

అయితే ఈ ఘటన గత నెల 29న జరగగా.. తాజాగా ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెట్టింట ఈ వీడియో చూసిన జనాలు కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కడం ప్రమాదకరమని.. వీలైతే తర్వాత ట్రైన్‌లో వెళ్లాలి కానీ.. ఇలా రన్నింగ్ ట్రైన్ ఎక్కవద్దని కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us