పిల్లల కోసం కేంద్రం అదిరిపోయే పథకం.. దరఖాస్తు సింపుల్..
Venkatrao Lella
Images: Pinterest
25 OCT 2026
నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య (NPS) కేంద్రం నిర్వహించే ఒక కాంట్రిబ్యూటరీ పథకం. తమ మైనర్ పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు దీని ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు నెలకు కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి స్టార్ట్ చేయొచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేకపోవడంతో ఎంతైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చు.
ఈ పథకంలో చేరిన తల్లిదండ్రులు, సంరక్షకులకు 2025 కేంద్ర బడ్జెట్‌లో పన్ను ప్రయోజనాలను కూడా అందించారు. ఈ మేరకు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను మినహాయింపు గురించి ప్రకటన చేశారు.
ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా https://npstrust.org.in/open-nps-vatsalya అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
ప్రోటీన్, కెఫిన్‌టెక్, క్యామ్స్ అనే మూడు CRAల నుండి ఎంచుకోవచ్చు.
CAMS కొత్త పేజీపై క్లిక్ చేస్తే ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. మైనర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సంరక్షకుని పేరు, పాన్ నెంబర్, సంరక్షకుని పుట్టిన తేది, సంరక్షకుని ఇమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వివరాలు అందించాలి.
అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత దిగువన 'ఓపెన్ NPS వాత్సల్య అకౌంట్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఇలా మీరు సులువుగా అకౌంట్ తెరవొచ్చు.
భారత పౌరులతో పాటు ఎన్ఆర్‌ఐలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(OCI) సభ్యులు కూడా తమ పిల్లలకు అకౌంట్ తెరవొచ్చు. మైనర్ల అకౌంట్‌కు కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా కాంట్రిబ్యూషన్స్ అందించవచ్చు.
అకౌంట్ తెరిచిన 3 ఏళ్ల తర్వాత 25 శాతం డబ్బులు పాక్షింగా విత్ డ్రా చేసుకోవచ్చు. గరిష్టంగా మూడు సార్లు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. పిల్లలకు 18 ఏళ్లు దాటాక నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్‌గా మారుతుంది.
తమ పిల్లల కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది ఈ పథకంలో చేరి ప్రయోజనం పొందుతున్నారు.