AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం సినిమా రా నాయనా.. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. గ్లామర్ పాటలు లేవు.. అయినా 100 కోట్లతో బాక్సాఫీస్ సెన్సేషన్..

ప్రస్తుత కాలంలో స్టార్ హీరోహీరోయిన్స్, గ్లామర్ పాటలు కాదు.. కంటెంట్ ముఖ్యమంటున్నారు అడియన్స్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా ఇప్పుడు థియేటర్లలో దుమ్మురేపుతుంది. కేవలం 2 కోట్లతో తెరకెక్కించిన ఆ చిత్రం ఇఫ్పుడు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Rajitha Chanti
|

Updated on: Oct 25, 2026 | 3:30 PM

Share
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు, వందల కోట్ల భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే రికార్డులు సృష్టిస్తాయనే అపోహను ఎప్పుడూ కొన్ని చిన్న సినిమాలు పటాపంచలు చేస్తుంటాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా చూడకుండా బ్రహ్మరథం పడతారు అనడానికి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఒక సరికొత్త చిత్రం అద్దం పడుతోంది. ఎటువంటి భారీ అంచనాలు లేకుండా, కేవలం రూ. 2.5 కోట్ల తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ చిత్రం 'ప్రేమద ఊరల్లి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

1 / 5
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభంగా జరగలేదు. సినిమా నిర్మాణం సమయంలో దర్శకుడు, నిర్మాతలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక ఇబ్బందులు తారస్థాయికి చేరినప్పుడు సినిమా పూర్తి చేయడం కోసమే ఏకంగా కుటుంబ సభ్యుల ఆభరణాలను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక విడుదలకు ముందు థియేటర్లు దొరక్క, పెద్దగా ప్రమోషన్స్ చేయడానికి కూడా బడ్జెట్ లేక మేకర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

2 / 5
తొలి రోజు కేవలం కొన్ని థియేటర్లలోనే విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులకు రీచ్ కావడం కోసం వినూత్న రీతిలో వివాహ ఆహ్వాన పత్రికల మాదిరిగా కరపత్రాలు పంచుతూ ప్రజలను సినిమా చూడమని కోరాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే మౌత్ టాక్  అద్భుతంగా పనిచేసింది. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో క్రమక్రంగా షోల సంఖ్య పెరుగుతూ వచ్చింది. చిన్న సినిమాగా వచ్చి ఊహించని విధంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లను సాధించి అందరినీ విస్మయానికి గురిచేసింది.

3 / 5
కేవలం రూ. 2.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై, వంద కోట్ల క్లబ్‌లో చేరడం ద్వారా ఈ చిత్రం సరికొత్త రికార్డును సృష్టించింది. పెట్టిన పెట్టుబడికి దాదాపు 40 నుంచి 50 రెట్లు లాభాలను తెచ్చిపెట్టి, కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా, పలువురు స్టార్ హీరోల సినిమాల రికార్డులను సైతం వెనక్కి నెట్టి కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో సముచిత స్థానం సంపాదించుకుంది.

4 / 5
ఈ అద్భుత విజయం త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమనే ఊరిలో' పేరుతో డబ్ చేసి విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారనేదానికి 'ప్రేమద ఊరల్లి' సినిమా మరోసారి నిదర్శనంగా నిలిచింది. అయితే, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ) విడుదల గురించి వస్తున్న వార్తలపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. సినిమా ప్రసుత్తం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నందున, ఇప్పటివరకు ఏ ప్రముఖ ఓటీటీ సంస్థతోనూ డిజిటల్ స్ట్రీమింగ్ ఒప్పందాలు కుదుర్చుకోలేదని మేకర్స్ స్పష్టం చేశారు.

5 / 5
Follow Us