French Open 2026: పోరాడి ఓడిన సింధు.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ విజేతగా అన్ సెయంగ్..!
PV Sindhu vs An Se-young: ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (P.V. Sindhu)కు నిరాశ ఎదురైంది. ప్రపంచ నంబర్-1, డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్ అన్ సెయంగ్ (An Se-young) మూడు గేమ్‌ల ఉత్కంఠభరిత పోరులో సింధును ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలి గేమ్‌ను సింధు గెలిచినా.. తర్వాతి రెండు గేమ్‌లలో అన్ సెయంగ్ ఆధిపత్యం ప్రదర్శించింది.

PV Sindhu vs An Se-young: ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (P.V. Sindhu)కు నిరాశ ఎదురైంది. ప్రపంచ నంబర్-1, డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్ అన్ సెయంగ్ (An Se-young) మూడు గేమ్‌ల ఉత్కంఠభరిత పోరులో సింధును ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలి గేమ్‌ను సింధు గెలిచినా.. తర్వాతి రెండు గేమ్‌లలో అన్ సెయంగ్ ఆధిపత్యం ప్రదర్శించింది.
తొలి గేమ్‌లో సింధు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. కీలక పాయింట్ల వద్ద ఒత్తిడిని అధిగమిస్తూ 21-16తో గేమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో అన్ సెయంగ్‌పై మ్యాచ్‌ను గెలిచే దిశగా సింధు బలమైన అడుగు వేసింది.
అయితే రెండో గేమ్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ సెయంగ్ తన ఆట వేగాన్ని పెంచుతూ సింధుపై ఒత్తిడి పెంచింది. భారత షట్లర్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా వరుస పాయింట్లు సాధించిన అన్ సెయంగ్ 21-11తో రెండో గేమ్‌ను గెలుచుకుంది. దీంతో మ్యాచ్ 1-1తో సమమైంది.
నిర్ణాయక మూడో గేమ్‌లోనూ అన్ సెయంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. సింధు నుంచి వచ్చిన ప్రతిఘటనను సమర్థంగా ఎదుర్కొంటూ కీలక ర్యాలీల్లో పాయింట్లు సాధించింది. చివరకు 21-12తో మూడో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
అన్ సెయంగ్ ఆధిపత్యం కొనసాగింపు
మ్యాచ్‌ను అన్ సెయంగ్ 16-21, 21-11, 21-12తో గెలిచింది. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత వరుసగా రెండు గేమ్‌లను గెలిచి ప్రపంచ నంబర్-1 తన స్థాయిని మరోసారి చాటుకుంది.
మరోవైపు సింధు అద్భుతమైన పోరాటంతో ఫైనల్ వరకు చేరుకుంది. తొలి గేమ్‌ను గెలిచి టైటిల్‌పై ఆశలు పెంచినా.. చివరి రెండు గేమ్‌లలో అన్ సెయంగ్‌ను అడ్డుకోలేకపోయింది.
అన్ సెయంగ్‌పై ఇప్పటివరకు సింధుకు ఎదురైన సవాలు ఈ ఫైనల్‌లోనూ కొనసాగింది. అయితే సింధు తొలి గేమ్‌ను గెలవడం ద్వారా మ్యాచ్‌లో గట్టి పోటీ ఇచ్చింది. చివరికి అన్ సెయంగ్ విజేతగా నిలిచి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని సొంతం చేసుకుంది.
అన్ సెయంగ్‌పై సింధుకు ఇప్పటివరకు విజయం లేదు..
పీవీ సింధు కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. అయితే అన్ సెయంగ్ మాత్రం ఆమెకు కొరకరాని కొయ్యగా మారింది. ఇప్పటివరకు ఈ ఇద్దరూ 10 సార్లు తలపడగా.. ప్రతి మ్యాచ్‌లోనూ అన్ సెయంగ్ విజయం సాధించింది.
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో సింధుకు మరో అవకాశం వచ్చింది. టోర్నీలో ఇప్పటివరకు సింధు మంచి ఫామ్‌లో ఉంది. అయితే ప్రత్యర్థిగా ఉన్న ప్రపంచ నంబర్-1ను ఓడించాలంటే తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుంది.
అన్ సెయంగ్ అద్భుత రికార్డు
అన్ సెయంగ్ కెరీర్‌లో ఇప్పటివరకు 423 విజయాలు, 70 పరాజయాలు ఉన్నాయి. 2026లో ఆమె మరింత అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 65 విజయాలు సాధించిన అన్ సెయంగ్.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడింది.
ఫైనల్‌కు సింధు ప్రయాణం
రౌండ్ ఆఫ్ 32: సుపనిదా కటెథాంగ్‌పై 21-14, 8-21, 23-21 విజయం
రౌండ్ ఆఫ్ 16: రికో గుంజిపై 21-12, 21-16 విజయం
క్వార్టర్ ఫైనల్: చియు పిన్-చియాన్‌పై 21-13, 21-14 విజయం
సెమీఫైనల్: హినా అకేచిపై 21-10, 20-22, 21-16 విజయం
సెమీఫైనల్‌లో సింధు మూడు గేమ్‌ల పోరాటంలో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
అన్ సెయంగ్ ఫైనల్ దాకా ఎలా వచ్చింది?
అన్ సెయంగ్ కూడా టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
రౌండ్ ఆఫ్ 32: అమాలీ షుల్జ్‌పై 21-6, 21-4
రౌండ్ ఆఫ్ 16: తాన్వీ శర్మపై 21-11, 21-14
క్వార్టర్ ఫైనల్: హాన్ యూపై 21-13, 21-16
సెమీఫైనల్: నోజోమీ ఒకుహారాపై 21-12, 21-19
ఫైనల్‌లో సింధు తన ప్రత్యర్థిపై ఉన్న చెడు రికార్డును మార్చాలని చూస్తుండగా.. అన్ సెయంగ్ మాత్రం భారత స్టార్‌పై తన అజేయ రికార్డును కొనసాగించాలని భావిస్తోంది.
10 సార్లు ఓడించిన ప్రత్యర్థిపై 11వ ప్రయత్నంలో సింధు బోణీ విజయం సాధిస్తుందా? లేక అన్ సెయంగ్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుతుందా? ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో దీనికి సమాధానం లభించనుంది.
