AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: ఏపీకి మరో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్ ఫిక్స్..! రైల్వేశాఖ నుంచి అప్డేట్..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చే అకాశముంది. ఇప్పటికే ముంబై-బెంగళూరు మధ్య స్లీపర్ రైలు నవంబర్ 1 నుంచి నడిపేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఇది ఏపీ మీదుగా వెళ్లనుంది. ఇది కాకుండా మరో స్లీపర్ ట్రైన్ రానుంది.

Venkatrao Lella
|

Updated on: Oct 25, 2026 | 4:04 PM

Share

భారతదేశంలో విశాలమైన రైల్వే నెట్ వర్క్ ఉంది. దేశ నలుమూలలకు ఇది విస్తరించి ఉంది. దీంతో దేశంలో ఏ ప్రాతం నుంచి ఏ ప్రాంతానికైనా తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఏపీలో వందే భారత్ రైళ్లు నడుస్తోండగా.. వందే భారత్ స్లీపర్ రైలు కూడా త్వరగా రానుంది. నవంబర్ 1వ తేదీన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ రైలు ఏపీ మీదుగా ప్రయాణం సాగించనుంది.

1 / 5
ఏపీలోని గుంతకల్, అనంతపురం రైల్వే స్టేషన్లలో ఈ వందే భారత్ స్లీపర్ రైలు ఆగనుంది. అయితే ఇది కాకుండా ఏపీకి మరో వందే భారత్ స్లీపర్ రైలు కూడా రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, నిధులపై సుదీర్ఘంగా చర్చించారు. దీనికి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.

2 / 5
ఈ భేటీలో విశాఖపట్నం నుంచి తిరుపతికి అదనంగా రెండు రైళ్లను నడిపేలా చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖ మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. విశాఖపట్నం-బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించాలని కోరారు. అలాగే పగటిపూట ప్రయాణికుల కోసం విశాఖ-తిరుపతి మధ్య మరో రైలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ రెండు ప్రతిపాదనల పట్ల అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి సమ్మతిని తెలియచేశారు.

3 / 5
కొత్తగా నిర్మించిన కనిగిరి-విజయవాడ రైల్వే లైన్‌లో ట్రైన్ సేవలను అందుబాటులోకి తీసురావాలని చంద్రబాబు కోరారు. దాదాపు అశ్విని వైష్ణవ్‌తో 40 నిమిషాల పాటు వివిధ రైల్వే ప్రాజెక్టుల విషయమై చంద్రబాబు చర్చించారు. పోర్టుల నుంచి సరుకు రవాణాను సులభతరం చేయడం, తూర్పు-పశ్చిమ ప్రాంతాల మధ్య అనుసంధానం బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

4 / 5
తిరుమలకు భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు రోజూ పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో తిరుపతి మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులను నడపాలని చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us