SBI కొత్త విత్ డ్రా రూల్స్.. ఈ పరిమితి దాటితే బాదుడే బాదుడు.. ఒక్కొ ట్రాన్సాక్షన్‌కు ఏకంగా..
ఎస్బీఐ ఖాతాదారులకు షాక్. ఏటీఎం విత్ డ్రా ఉచిత పరిమితిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఆంక్షలు విధించింది. ఉచిత ట్రాన్సాక్షన్ల లిమిట్‌ను భారీగా తగ్గించింది. ఇక నుంచి ఉచిత లావాదేవీల పరిమితి దాటితే బాదుడే. ఛార్జీలను ఎస్బీఐ భారీగా పెంచింది.

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్స్ అకౌంట్ లేదా శాలరీ అకౌంట్ ఉందా..? అయితే బ్యాడ్ న్యూస్. ఏటీఎం నిబంధనల్లో పూర్తిగా మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ఏటీఎం ఉచిత లావాదేవీల సంఖ్యను ఎస్‌బీఐ భారీగా తగ్గించింది. అంతేకాకుండా ఏటీఎం లావాదేవీల చార్జీలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అకౌంట్ కేటగిరిని బట్టి ఎస్బీఐ ఉచిత లావాదేవీల పరిమితులను అందిస్తోంది. ఒక్కొ అకౌంట్‌కు ఒక్కొలా పరిమితులు విధించింది. ఇప్పుడు బేసిస్ సేవింగ్స్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఖాతాదారులకు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితికి సంబంధించి ఆంక్షలు విధించింది.
కొత్త ఏటీఎం విత్ డ్రా రూల్స్ వచ్చేశాయి..
బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి ఏటీఎంల వద్ద ఉచిత విత్ డ్రా లిమిట్ తగ్గించారు. ఇక నుంచి నెలకు నాలుగుసార్లు మాత్రమే ఉచితంగా ఏటీఎంల్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.15+జీఎస్టీ విధిస్తారు. దీని వల్ల ఏటీఎంలు ఎక్కువగా ఉపయోగించే ఖాతాదారులపై అదనపు ఛార్జీల రూపంలో భారం పడనుంది. దీంతో ఏటీఎం లావాదేవీలు చేసేవారు ఉచిత పరిమితి, ఛార్జీలపై అవగాహన కలిగి ఉండాలి. ఇక ఎస్బీఐ శాలరీ అకౌంట్ వినియోగదారులకు కూడా ఇతర బ్యాంక్ ఏటీఎంల వద్ద ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గించింది. ఇక నుంచి నెలకు ఐదు లావాదేవీలు మాత్రమే ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద ఉచితం చేసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 10గా ఉండగా.. ఇప్పుడు 5కి తగ్గించారు. ఇక ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్ల వద్ద ఉండే ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా సరే..
అయితే ఉచిత లావాదేవీల పరిధిలోకి ఆర్ధికేతర లావాదేవీలను కూడా చేర్చారు. అంటే బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేడ్ మెంట్ వంటికి కూడా ఈ పరిధిలోకి రానున్నాయి. కేవలం ఏటీఎం ఉపయోగించి మనీ విత్ డ్రా చేసుకునే లావాదేవీలు కాకుండా మిగతా లావాదేవీలను కూడా ఉచిత పరిమితి జాబితాలో చేర్చారు. ఐదు ఉచిత లావాదేవీల తర్వాత చేసే ప్రతీ విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ విధిస్తారు. ఇక ఆర్ధికేతర లావాదేవీలకు రూ.11+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఈ కొత్త ఛార్జీలను గమనించాలని ఎస్బీఐ సూచించింది. వీటిని గమనించి వాటికనుగుణండా లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. అటు పలు క్రెడిట్ కార్డులకు ఎయిర్ పోర్టులో ఉచిత లాంజ్ సౌకర్యాల సంఖ్యను తగ్గించింది. అన్ని బ్యాంకులు ఉచిత లాంజ్ లిమిట్ తగ్గించడంతో.. ఎస్బీఐ కూడా అదే పని చేసింది.
