AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పొదల్లో కదులుతూ ఏదో ఆకారం కనిపించింది.. భయంతోనే అటుగా వెళ్లి చూడగా

ఓ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర పొదల్లో వింత ఆకారం కనిపించింది. అదేంటా అని వెళ్లి చూసిన స్థానికులకు షాక్ తగిలింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. మరి అదేంటో.? ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

Viral Video: పొదల్లో కదులుతూ ఏదో ఆకారం కనిపించింది.. భయంతోనే అటుగా వెళ్లి చూడగా
Representative Image
Noor Mohammed Shaik
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 15, 2025 | 8:51 AM

Share

ఒడిశా రాష్ట్రంలోని కటక్ జిల్లా ఆఠగఢ ఘంటిఖాల్ ప్రాంతంలో 15 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. జేకే లక్ష్మీ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని పొదల్లో ఇది ప్రత్యక్షమవడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. భారీ ఆకారంతో కదులుతున్న కొండచిలువను చూసినవారు మొదట భయంతో వెనక్కి వెళ్లినప్పటికీ, కొంత సమయం కాగానే పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరి గుంపులుగా తిలకించడం ప్రారంభించారు. కొండచిలువ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం చూసిన కొందరు, అది ఏదో అడవి జంతువును మింగి జీర్ణించలేక అలసిపోయి అక్కడే పడిపోయి ఉండొచ్చని అనుమానించారు. వెంటనే స్థానికుల్లో ఒకరు పాములను పట్టడంలో ప్రావీణ్యం కలిగిన శుశాంత పాత్రా అనే నిపుణుడికి సమాచారం అందించారు.

ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

సమాచారం అందుకున్న పాత్రా కొద్దిసేపటికే ఘటన స్థలానికి చేరుకుని కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు. తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకేని పైథాన్‌ను పరిశీలించారు. అధికారుల తనిఖీల్లో కొండచిలువకు ఎలాంటి గాయాలు లేవని ధృవీకరించడంతో.. దానిని తిరిగి సురక్షితంగా అడవిలో వదిలివేశారు. అయితే ఎలాంటి అపాయం లేకుండా పైథాన్‌ను బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకృతి ప్రేమికులు, స్థానికులు, అటవీ శాఖ అధికారులు శుశాంత పాత్రా చేసిన పనిని కొనియాడారు. అటవీశాఖ ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసింది. అటవీ శాఖ అధికారుల ప్రకారం అడవి జంతువులు ప్రజల ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలంటున్నారు. పాములను గాయపరిచే ప్రయత్నాలు చేయకుండా, తక్షణమే అధికారులకు లేదా పాము పట్టే నిపుణులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు