AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey: ఇలా బకెట్లలో తెచ్చి అమ్ముతుంటే ఒరిజినల్ తేనె అని కొనేస్తున్నారా..?

కాదేదీ కల్తీకి అనర్హం? ఇది క‌లికాలం కాదు క‌ల్తీ కాలమైది..! మ‌నం ఇంట్లో ఉప‌యోగించే నిత్య‌వ‌స‌ర వ‌స్తువులన్నీ క‌ల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఓల్డ్‌సిటీలో కల్తీ తేనె రాకెట్‌ను బ్రేక్‌ చేశారు కంచన్‌బాగ్‌ పోలీసులు. పక్కా నిఘా పెట్టి బాబానగర్‌లోని ఓ ఇంటిపై రెయిడ్‌ చేసి భారీగా నిల్వ చేసిన కల్తీ తేనెను స్వాధీనం చేసుకున్నారు.

Honey: ఇలా బకెట్లలో తెచ్చి అమ్ముతుంటే ఒరిజినల్ తేనె అని కొనేస్తున్నారా..?
Adulterated Honey
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2025 | 3:45 PM

Share

అక్టోబర్ 16 గురువారం నాడు కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ తేనె రాకెట్ గుట్టు రట్టు చేశారు అధికారులు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు 100 కిలోల కల్తీ తేనెను స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితులు రోడ్డు పక్కన తేనె అమ్మేవారని, గత 10-15 సంవత్సరాలుగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. బెల్లం, నీళ్లు, కొన్ని కెమికల్స్‌ కలిపి ఈ ఫేక్‌ హనీ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. బ్రాండెడ్‌ లేబుల్స్‌ అతికించి వాటిని మార్కెట్‌లో డంప్‌ చేస్తున్నారన్నారు. రంగు, రుచి అచ్చం తేనెలాగే ఉండడంతో ఇన్నాళ్లూ వీరి దందా యధేచ్చగా సాగింది.

100 కిలోల తేనె, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. ప్యూర్‌ హనీ పేరుతో జనాలకు కల్తీ తేనెను విక్రయిస్తోన్న ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరున్నారో ఆరా తీస్తున్నారు. అసలు ఇప్పుడు అందరూ తేనెనే వినియోగిస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదని.. పంచదార, బెల్లం బదులు తేనె వైపు మొగ్గు చూపుతున్నారు. ఇన్ని కోట్ల మంది జనాభాకు ఎంత తేనె అవసరం అవుతుంది. నిజంగా అంత తేనెను ప్రొడ్యూస్ చేసే వీలుందా.. బ్రాండ్, లేబుల్స్ చూసి మోసపోకండి. మార్కెట్‌లో 90 శాతం తేనె పక్కా ఫేక్.

Also Read: ఘట్‌కేసర్‌లో అనుమానాస్పదంగా 17 ఏళ్ల బాలుడు.. ఆపి తనిఖీ చేయగా..

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..