AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేదు

NER Apprentice Recruitment 2025 Notification: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నార్త్ ఈస్టర్న్‌ రైల్వే (NER) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం..

Railway Jobs 2025: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేదు
North Eastern Railway Jobs
Srilakshmi C
|

Updated on: Oct 18, 2025 | 4:02 PM

Share

ఇండియన్‌ రైల్వే పరిధిలోని నార్త్ ఈస్టర్న్‌ రైల్వే (NER).. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1104 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 15వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల ఈ కింద చెక్‌ చేసుకోండి..

యూనిట్ల వారిగా అప్రెంటిస్‌ ఖాళీల వివరాలు ఇవే..

  • మెకానికల్ వర్క్‌షాప్‌/గోరఖ్‌పుర్‌లో ఖాళీల సంఖ్య: 390
  • సిగ్నల్‌ వర్క్‌షాప్‌/గోరఖ్‌పుర్‌లో ఖాళీల సంఖ్య: 63
  • బిడ్జి వర్క్‌షాప్‌/గోరఖ్‌పుర్‌లో ఖాళీల సంఖ్య: 35
  • మెకానికల్ వర్క్‌షాప్‌/ఇజ్జత్‌నగర్‌లో ఖాళీల సంఖ్య: 142
  • డీసిల్‌ షెడ్‌/ఇజ్జత్‌నగర్‌లో ఖాళీల సంఖ్య: 60
  • క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌/ఇజ్జత్‌నగర్‌లో ఖాళీల సంఖ్య: 64
  • క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌/ లక్నోలో ఖాళీల సంఖ్య: 149
  • డీసిల్‌ షెడ్‌/గోండలో ఖాళీల సంఖ్య: 88
  • క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌/వారణాసిలో ఖాళీల సంఖ్య: 73
  • టీఆర్‌డీ వారణాసిలో ఖాళీల సంఖ్య: 40

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి: 2025 అక్టోబర్‌ 16వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ఆధారంగా నవంబర్‌ 15, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.ఎంపికైన వారికి నిబంధనల మేరక స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషణ్‌లో తెలుసుకోవచ్చు.

నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు