Samsung Galaxy M14 5G: సూపర్ బ్యాటరీ పవర్‌తో వచ్చే టాప్ సామ్‌సంగ్ ఫోన్ ఇదే.. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోనే ధర
భారతదేశంలో ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలు ఉన్న నేపథ్యంలో వారికి అందుబాటు ధరల్లో కొత్త ఫోన్‌లను రిలీజ్ చేస్తుంది. త్వరలో విడుదల కానున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 14 5జీ ఫోన్ 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, సెగ్మెంట్-లీడింగ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, అత్యాధునిక 5 ఎన్‌ఎం ప్రాసెసర్, వేగవంతమైన 5జీ సామర్థ్యాలతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. అయితే ముఖ్యంగా అందుబాటు ధరలో ఉండే ఈ తాజా 5జీ ఫోన్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

సామ్‌సంగ్ ఉత్పత్తులకు భారతదేశంలో ఉన్న డిమాండ్ వేరు. ముఖ్యంగా సామ్‌సంగ్ మొబైల్‌ఫోన్స్ అంటే ఆ క్రేజే వేరు. అధిక ప్రజాదరణ నేపథ్యంలో సామ్‌సంగ్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌లో మొబైల్ ఫోన్స్‌ను రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలు ఉన్న నేపథ్యంలో వారికి అందుబాటు ధరల్లో కొత్త ఫోన్‌లను రిలీజ్ చేస్తుంది. త్వరలో విడుదల కానున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 14 5జీ ఫోన్ 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, సెగ్మెంట్-లీడింగ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, అత్యాధునిక 5 ఎన్‌ఎం ప్రాసెసర్, వేగవంతమైన 5జీ సామర్థ్యాలతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. అయితే ముఖ్యంగా అందుబాటు ధరలో ఉండే ఈ తాజా 5జీ ఫోన్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
2019 నుంచి ఎం సిరీస్‌కు ఎక్కువ ప్రజాదరణ
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం సిరీస్ 2019లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి ఆక్టాకోర్ ఎన్‌ఎం ప్రాసెసర్లతో వస్తున్నాయి. గతంలో ఇదే సిరిస్ నుచి ఎం 30 ఎస్‌లో శక్తివంతమైన 6000 ఎంఏహెచ్ వచ్చింది. అలాగే గెలాక్సీ ఎం 31 ఎస్‌లో సింగిల్ టేక్‌తో కూడిన 64 ఎంపీ కెమెరాతో వస్తుంది. కాబట్టి ఎం సిరీస్‌తో వచ్చే ఫోన్లు అంటే ప్రత్యేకంగా బ్యాటరీతో పాటు మంచి కెమెరా ఇస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఈ ఫోన్‌లో కూడా అధిక బ్యాటరీ పవర్‌తో పాటు మంచి కెమెరాతో వస్తుంది.
50 ఎంపీ కెమెరా
ముఖ్యంగా ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు సామ్‌సంగ్ ఎం 14 5 జీ చాలా సౌకర్యంగా ఉంటుంది. 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాతో సెటప్‌తో వచ్చే 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మూమెంట్స్ మాన్‌స్టర్‌గా కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్‌లో వచ్చే లెన్స్ తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా మెరుగైన ఫొటోగ్రఫిను అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పెర్‌ఫార్మెన్స్
ఈ ఫోన్‌లో వచ్చే 5 ఎన్‌ఎం ప్రాసెసర్‌తో వస్తుంది. కాబట్టి ఈ ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని మెరుగ్గా అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సూపర్ స్పీడ్ 5జీ బ్యాండ్‌లతో వచ్చే ఈ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌ను చాలా వేగంగా సంగ్రహిస్తుందని వివరిస్తున్నారు. ఈ వేగం కారణంగా కంటెంట్‌ను వేగంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఈ ఫోన్ మరింత ఆకట్టుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
సూపర్ బ్యాటరీ
ఈ ఫోన్‌లో భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీను కంపెనీ అందిస్తుంది. భారీ బ్యాటరీ కారణంగా ప్రయణాల్లో ఈ ఫోన్ చాలా సౌకర్యంగా ఉంటుంది. అంటే అధికంగా ప్రయాణాలు చేసేవారి ఈ ఫోన్ అనేది అనువుగా ఉంటుందని మార్కెట్ నిపుణుల మాట. ఈ ఫోన్‌ను ఓ సారి చార్జ్ చేస్తే దాదాపు రెండు రోజులు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ ఫోన్ 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దుతునిస్తుంది. కాబట్టి ఎక్కువ సేపు ఫోన్ వాడే వారికి ఈ ఫోన్ అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ఇప్పటికే సామ్‌సంగ్‌తోపాటు అమెజాన్‌లో వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 4జీబీ+128 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్ ధర రూ.14,990గా అమెజాన్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ ధరతో పాటు అమెజాన్‌లో వచ్చే బ్యాంకు ఆఫర్లను కలుపుకుంటే ఈ ఫోన్ కేవలం రూ.13,500కే వినియోగదారులకు చేతికి రానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..