Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy M 34: సామ్‌సంగ్‌ నుంచి న్యూ 5 జీ ఫోన్‌.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు భారతదేశంలో సామ్‌సంగ్‌ ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు. తాజాగా సామ్‌సంగ్‌ తన స్మార్ట్‌ఫోన్‌ శ్రేణిని మరింత విస్తృతరిచేలా సరికొత్త 5 జీ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 34 5జీ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ ఫోన్‌ కచ్చితంగా వినియోగదారులకు ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

Samsung Galaxy M 34: సామ్‌సంగ్‌ నుంచి న్యూ 5 జీ ఫోన్‌.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు
Samsung Galaxy M34 5g
Follow us
Srinu

| Edited By: Madhu

Updated on: Jul 08, 2023 | 6:21 PM

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఫోన్లు ఉంటున్నాయి. గతంలో ఫోన్లు కేవలం కాల్స్‌ చేసుకోవడానికి, మెసేజ్‌లు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ క్రమేపి అందులో వివిధ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వివిధ యాప్స్‌ ద్వారా సమస్త ప్రపంచం అరచేతిలోనే అనే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌లో వచ్చే కెమెరాలకు ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ప్రస్తుత రోజుల్లో కెమెరాల క్వాలిటీ చూసి ఫోన్లు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలు కూడా కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా ఫోన్లను రిలీజ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు భారతదేశంలో సామ్‌సంగ్‌ ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు. తాజాగా సామ్‌సంగ్‌ తన స్మార్ట్‌ఫోన్‌ శ్రేణిని మరింత విస్తృతరిచేలా సరికొత్త 5 జీ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 34 5జీ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ ఫోన్‌ కచ్చితంగా వినియోగదారులకు ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 34 5జీ ఫోన్‌ మిడ్‌నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్‌ఫాల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6జీబీ + 128జీబీ వేరియంట్‌లో లభించే ఈ ఫోన్‌ ధర రూ.18,999గా ఉంటే 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర రూ.20,999గా ఉంది. ఈ ఫోన్‌ అమెజాన్‌, సామ్‌సంగ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ సేల్‌ జూలై 15న ప్రారంభం కానుంది. అలాగే ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ ఫోన్‌ ప్రీ ఆర్డర్‌ ఇప్పటికే ప్రారంభమైంది. రూ.999తో ప్రీ ఆర్డర్‌ చేసిన కస్టమర్లకు  రూ.1699 విలువైన 25 వాట్స్‌ ఛార్జర్ ఉచితంగా లభిస్తుంది. అలాగే ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే 9 నెలల నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 34 5 జీ ఫీచర్ల ఏంటో ఓ సారి చూద్దాం. 

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 34 5 జీ ఫీచర్లు ఇవే

  • 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్ ఎమోఎల్‌ఈడీ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే
  • ఎక్సినోస్ 1280 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
  • 6జీబీ, 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ అంతర్గత నిల్వ. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు విస్తరించే అవకాశం
  • డ్యూయల్ సిమ్ స్లాట్‌
  • 50 ఎంపీ వెనుక కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా
  • 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • యూఎస్‌బీ టైప్-సి ఆడియో, డాల్బీ అట్మోస్
  • 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..