- Telugu News Photo Gallery Technology photos Noise launches 2 new smart watches Noisefit fuse plus and noise fit twist pro features and price
NoiseFit: నాయిస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లు.. ఫీచర్స్ అదుర్స్ అంతే..
ప్రముఖ గ్యాడ్జెట్ కంపెనీ నాయిస్ మార్కెట్లోకి రెండు స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసింది. నాయిస్ ఫిట్ ఫ్యూజ్ ప్లస్, నాయిస్ ఫిట్ ట్విస్ట్ ప్రో పేర్లతో ఈ వాచ్‌లను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ వాచ్‌లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం..
Updated on: Jul 08, 2023 | 12:22 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కంపెనీ నాయిస్ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసింది. నాయిస్ ఫిట్ ఫ్యూజ్ ప్లస్, నాయిస్ ఫిట్ ట్విస్ట్ ప్రో పేరుతో రెండు వాచ్‌లను తీసుకొచ్చారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ల ధర రూ. 2199 నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 8వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎన్నో అధునాతన ఫీచర్లను అందించారు.

ఫ్యూజ్ ప్లస్ వాచ్‌లో 1.43 ఇంచెస్ హెచ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 100కిపైగా క్లౌడ్ వాచ్ ఫేస్‌లను ఇచ్చారు. అలాగే 24/7 హార్ట్ సెన్సార్, హెల్త్ ట్రాకర్ వంటి ఫీచర్లను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ కావడం ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత. 60కిపైగా స్పోర్ట్స్ మోడల్స్ ఈ వాచ్ సొంతం.

నాయిస్ ఫిట్ ట్విస్ట్ ప్రో వాచ్‌లో 240×240 రిజల్యూషన్‌తో కూడిన 1.4 ఇంచెస్ హెచ్‌డీ అమోఎల్‌ఈడి డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ వాచ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 7 రోజుల వరకు పనిచేస్తుంది.





























