Galaxy M34 5G: సామ్‌సంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది.. రూ. 17 వేలలో 50 ఎంపీ కెమెరా..

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌34 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Jul 09, 2023 | 11:43 AM

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్‌34 పేరుతో లాంచ్‌ చేసిన ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తక్కువ ధరలో మంచి ఫీచర్స్‌ను అందించారు.

1 / 5
 ఇప్పటికే లాంచ్‌ అయిన స్మార్ట్‌ ఫోన్‌ జూలై 15 నుంచి ఈకామర్స్‌ సైట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా డిస్కౌంట్ అందిస్తున్నారు.

2 / 5
 ధర విషయానికొస్తే 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 16,999, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,999గా ఉంది. ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

3 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5nm Exynos 1280 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు

4 / 5
కెమరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతోపాటు, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow us