FlipKart Offers: శామ్సంగ్ కొత్త 5జీ ఫోన్ రూ. 10వేలకే వచ్చేస్తోంది.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా.. ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు..

మీరు 5జీ ఫోన్ కొనాలనుకొంటున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ లో ఉంది. రూ. 17,490 విలువైన శామ్సంగ్ గేలాక్సీ ఎఫ్ 14 5జీ ని రూ. 10,000 లలోపు ధరలోనే పొందవచ్చు. అదెలాగో చూద్దాం రండి..

FlipKart Offers: శామ్సంగ్ కొత్త 5జీ ఫోన్ రూ. 10వేలకే వచ్చేస్తోంది.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా.. ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు..
Samsung Galaxy F14 5g
Follow us

|

Updated on: Apr 08, 2023 | 12:45 PM

కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు మీరు అందులో 5జీ సపపోర్టు ఉందో లేదో కచ్చితంగా తనిఖీ చేసుకోవాలి. జియో, ఎయిర్ టెల్ వంటి టెలికాం కంపెనీలు ఇప్పటికే 5జీ సేవలను పలు నగరాల్లో ప్రారంభించాయి. అయితే 5జీ సపోర్టుతో కూడిన ఫోన్ కొనాలంటే వాటి ధర రూ. 15,000 కన్నా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మీకో బంపర్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ లో ఉంది. రూ. 17,490 విలువచేసే శామ్సంగ్ 5జీ ఫోన్ కేవలం రూ. 10,000 కన్నా తక్కువ ధరలో నే మీరు పొందవచ్చు. ఆ ఆఫర్ ఏంటి? ఫోన్ మోడల్ ఏంటి? దాని స్పెక్స్, ఫీచర్లు వంటి పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం రండి..

ఫ్లిప్ కార్ట్ ఆఫర్స్..

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ ఫిప్ కార్ట్ లో మొబైల్ బొనాంజ సేల్ నడుస్తోంది. అనేక రకాల స్మార్ట్ ఫోన్లపై అనేక ఆఫర్లు ఉన్నాయి. అందులో శామ్సంగ్ గేలాక్సీ ఎఫ్ 14 5జీ ఫోన్ పై భారీ ఆఫర్ ఉంది. ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ కార్డు ఆఫర్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఆఫర్ ఇది..

శామ్సంగ్ గేలాక్సీ ఎఫ్ 14 5జీ ఫోన్ 4జీబీ, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన బేస్ వేరియంట్ ధర మన దేశీయ మార్కెట్లో రూ. 17,490 గా ఉంది. అయితే ఇది ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేస్తే, 17శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంంటే 14,490కే వస్తుంది. అలాగే హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగించి లావాదేవీ జరిపినా లేదా ఈఎంఐ తీసుకున్నా అదనంగా రూ.1500 తగ్గింపును పొందవచ్చు. అదే విధంగా మీ పాత ఫోన్ ఏదైనా ఎక్స్ చేంజ్ చేస్తే రూ.13,950 వరకూ ఎక్స్ చేంజ్ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే ఫోన్ రూ. 10,000 కంటే తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఫోన్ స్పెక్స్.. ఫీచర్లు ఇవి..

శామ్సంగ్ గేలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ లో 6.6 అంగుళాల హెడ్ డీ ప్లస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 సంరక్షణ ఉంటుంది. ఎక్సినోస్ 1330 5జీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ప్రత్యేకమైన మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో వెనుక వైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంసీ సెకండరీ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఉంటుంది. దీనిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..