Amazon Offers: సామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అమెజాన్‌లో బంపర్ డీల్.. రూ. 199కే గెలాక్సీ ఏ23..
వినియోగదారుల ఆదరణకు తగ్గట్టే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు ప్రత్యేక సేల్స్ ద్వారా భారీ తగ్గింపు ధరకు ఫోన్లను అందిస్తున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్‌లో మరో బంపర్ సేల్ మొదలైంది. బ్లాక్ బస్టర్ వాల్యూ సేల్ పేరుతో ఏప్రిల్ 14 నుంచి 17 వరకూ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తున్నారు.
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ల ద్వారా ప్రజలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఆఫ్‌లైన్ స్టోర్లతో పోల్చుకుంటే ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో మొబైల్స్‌పై భారీ తగ్గింపును ప్రకటించడంతో దాదాపు చాలా మంది ఆన్‌లైన్‌లోనే ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారుల ఆదరణకు తగ్గట్టే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు ప్రత్యేక సేల్స్ ద్వారా భారీ తగ్గింపు ధరకు ఫోన్లను అందిస్తున్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్‌లో మరో బంపర్ సేల్ మొదలైంది. బ్లాక్ బస్టర్ వాల్యూ సేల్ పేరుతో ఏప్రిల్ 14 నుంచి 17 వరకూ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తున్నారు. ఈ సేల్‌లో ప్రీమియం ఫోన్ల దగ్గర నుంచి బడ్జెట్ లెవెల్ ఫోన్ల వరకూ దాదాపు 40 శాతం తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌లో సామ్‌సంగ్ ఫోన్లకు ఉండే ఫ్యాన్ బేస్ వేరు. అందులోని సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లను ఇష్టపడని వారు ఉండరు. ఈ సేల్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 23పై భారీ తగ్గింపును ప్రకటించారు. ప్రస్తుతం అమెజాన్‌లో ఉండే ఆఫర్స్‌తో రూ.199కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
తగ్గింపు ఇలా
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.17,499గా ఉంది. అంటే సాధారణంగా ఈ ఫోన్ ధర రూ.23,990. అంటే సాధారణ ధరతో పోలిస్తే ఈ ఫోన్ 27 శాతం తక్కువ ధరకు లభిస్తుంది. అలాగే ఎస్‌బీఐ, హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపుగా లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ధర రూ.16,499కు చేరుతుంది. అలాగే మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.16300 వరకూ ఎక్స్చేంజ్ వాల్యూ పొందవచ్చు. అంటే మీరు పూర్తి స్థాయిలో ఎక్స్చేంజ్ వాల్యూ పొందితే ఈ ఫోన్ రూ.199కే మీ చేతికి వస్తుంది. అయితే ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీరు ప్రస్తుతం వాడే ఫోన్ స్థితిని బట్టి ఉంటుందని గమనించాలి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ23 ఫీచర్లు ఇవే
ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. 50 ఎంపీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చే ఈ ఫోన్ ఫొటో లవర్స్‌కు విపరీతంగా నచ్చుతుంది. 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..