Samsung A34, A54: శామ్సంగ్ కొత్త 5జీ ఫోన్లు చూశారా! స్టైలిష్ డిజైన్.. టాప్ ఫీచర్లు.. మామూలుగా లేవుగా!
ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ శామ్సంగ్ గెలాక్సీ ఏ34, ఏ54 ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్ కొనుగోలుతో రూ.3000 క్యాష్ బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ రూపంలో రూ.2500 బెనిఫిట్ పొందొచ్చు.
మనదేశంలో 5జీ వేగంగా విస్తరిస్తోంది. అందుకనుగుణంగానే దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలు 5జీ వేరియంట్లో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో చాలా కాలం క్రితమే శామ్సంగ్ తన కొత్త 5జీ వేరియంట్లు ఏ34, ఏ 54 సిరీస్ ఫోన్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఎట్టకేలకు మార్చి 16న వాటిని లాంచ్ చేసింది. ఈ ఫోన్లపై వినియోగదారుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ శామ్సంగ్ గెలాక్సీ ఏ34, ఏ54 ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్ కొనుగోలుతో రూ.3000 క్యాష్ బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్ రూపంలో రూ.2500 బెనిఫిట్ పొందొచ్చు. ఈ రెండు వేరియంట్ల ఫోన్ బుకింగ్స్‌తో రూ.999 విలువ గల గెలాక్సీ బడ్స్ లైవ్ ఉచితంగా పొందొచ్చు. వీటి ప్రత్యేకతలు, ఫీచర్లు, పనితీరు వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శామ్సంగ్ గెలాక్సీ ఏ34..
లుక్, డిజైన్.. శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఆకర్షణీయమైన లుక్, డిజైన్ లో ఉంది. ఈ ఫోన్ నాలుగు రంగులు లైమ్, గ్రాఫైట్, వయోలెట్, సిల్వర్ లలో అందుబాటులో ఉంది.
సామర్థ్యం.. దీనిలో సూపర్ అమోల్డ్ ప్యానెల్‌తో నిర్మితమైన 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ వాటర్ ట్రాప్ నాచ్ డిస్‌ప్లే ఉంది. 120 హెర్ట్ రీఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. వన్ యూ5.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఇందులో ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1080 ఒక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. అలాగే 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ తో ఇది వస్తోంది.
కెమెరా సెటప్.. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48 ఎంపీ ప్రైమరీ సెన్సార్ విత్ 8 ఎంపీ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5 ఎంపీ మాక్రో లెన్స్, ముందు వైపు సెల్ఫీ అండ్ వీడియో కాలింగ్ కోసం 13 ఎంపీ కెమెరా ఉంటుంది.
ధర.. రెండు వేరియంట్లో ఇది లభ్యం అవుతుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ మోడల్ రూ.30,999, 8జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల మోడల్ ఫోన్ రూ.32,999లకు కొనుగోలు చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ54 ..
లుక్, డిజైన్.. ఈ ఫోన్ మూడు కూడా అత్యాధునిక డిజైన్, ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులకు లభ్యం అవుతుంది. లైమ్, గ్రాఫైట్, వయోలెట్ రంగుల్లో ఇది దొరకుతుంది.
సామర్థ్యం.. దీనిలో సూపర్ అమోల్డ్ ప్యానెల్ కలిగిన 6.4-అంగుళాల ఫుల్ హెచ్డీ + పంచ్ హోల్ డిస్‌ప్లేతో ఉంటుంది. ఇది 120హెర్ట్ రీఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. ఎక్స్‌నోస్ 1380 ఒక్టాకోర్ ప్రాసెసర్ శక్తినిస్తోంది. ఆండ్రాయిడ్ 13పై వన్ యూఐ5.1 పై పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
కెమెరా.. దీనిలో కూడా వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, ఎల్‌ఈడీ ఫ్లాష్, 12 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 ఎంపీ మాక్రో లెన్స్ ఉంటాయి. ముందువైపు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32 ఎంపీ కెమెరా ఉంటుంది.
ధర.. ఈ ఫోన్ కూడా రెండు వేరింయట్లలో లభ్యమవుతోంది. 8జీబీ ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజీ గల ఫోన్ ధర రూ.38,999, 8జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల మోడల్ ధర రూ.40,999లకు లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..