Twitter Account : ట్విట్టర్ యూజర్లకు షాక్.. అమల్లోకి ఆ నిబంధన.. ఇకపై డబ్బులు కడితేనే..
వెరిఫైడ్ ఖాతాదారుల నుంచి సబ్‌స్క్రిప్షన్ వసూలు చేసేలా ఏప్రిల్ 1 అంటే శనివారం నుంచే కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో వెరిఫైడ్ బ్యాడ్జ్‌గా పిలిచే బ్లూ టిక్ తీసేశారు. ఇకపై సబ్‌స్క్రిప్షన్ కట్టిన వారికే వెరిఫైడ్ ఖాతా కింద గుర్తిస్తారు. ట్విట్టర్ కంపెనీ యూజర్‌బేస్, ఆదాయాన్ని పెంచడానికి కొత్త ప్రణాళికలను ప్రకటించింది.
ప్రస్తుతం యువత ఎక్కువగా సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండడంతో యువత ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. సోషల్ మీడియా అనగానే గుర్తు వచ్చే యాప్స్ ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్.. ఈ మూడు యాప్స్ వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. అయితే ట్విట్టర్ యాప్ ఎక్కువగా సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకూ అందరూ వాడుతున్నారు. యూజర్లు ఇందులో తమ ఫాలోవర్లను ఎంతమందిని పెంచుకుంటే అంత గౌరవంగా ఫీలవుతారు. ముఖ్యంగా ట్విట్లర్‌లో వెరిఫైడ్ ఖాతాలకు ఉండే క్రేజే వేరు. అయితే ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్.. సీఈఓ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వివిధ నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. భవిష్యత్‌తో వెరిఫైడ్ ఖాతాదారులు కావాలంటే సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలని సీఈఓగా ఉన్న ప్రారంభ రోజుల్లోనే చెప్పాశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలను నిజం చేస్తూ వెరిఫైడ్ ఖాతాదారుల నుంచి సబ్‌స్క్రిప్షన్ వసూలు చేసేలా ఏప్రిల్ 1 అంటే శనివారం నుంచే కొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో వెరిఫైడ్ బ్యాడ్జ్‌గా పిలిచే బ్లూ టిక్ తీసేశారు. ఇకపై సబ్‌స్క్రిప్షన్ కట్టిన వారికే వెరిఫైడ్ ఖాతా కింద గుర్తిస్తారు. ట్విట్టర్ కంపెనీ యూజర్‌బేస్, ఆదాయాన్ని పెంచడానికి కొత్త ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన కీలక అప్‌డేట్‌లలో ట్విట్టర్ బ్లూ లాంచ్ కూడా ఒకటిగా ఉంది. సబ్‌స్క్రిప్షన్‌లో లాంగ్-ఫార్మ్ ట్వీట్‌లు (280 అక్షరాలు దాటి), ట్వీట్‌లను అన్‌డు/ఎడిట్ చేయడం వంటి చాలా డిమాండ్ ఉన్న ఫీచర్‌లు ఉన్నాయి. ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్‌ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ బ్లూ టిక్‌ను బండిల్ చేస్తుందని మస్క్ చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను అందించడంతో పాటు నెలవారీ రుసుమును చెల్లించడం ద్వారా ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లో ధ్రువీకరించుకోవచ్చు.
చార్జీలు ఇలా
మీ ధ్రువీకరించిన స్థితిని సేవ్ చేయడానికి ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం ట్విటర్టర్ బ్లూ సభ్యత్వాన్ని కొనుగోలు చేయడమే. ఆండ్రాయిడ్ ఫోన్లు లేదా ఐఫోన్లలో దీని ధర రూ.900గా ఉంది. అయితే వెబ్ ద్వారా సబ్‌స్క్రయిబ్ చేస్తే మాత్రం ఈ ధర రూ. 650కి తగ్గుతుంది. అయితే వెబ్ సబ్‌స్క్రైబర్‌లు ఎటువంటి ఫీచర్‌లను కోల్పోరని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. యాప్‌లో కొనుగోళ్లపై మైక్రోసాఫ్ట్, బ్రౌజర్ డెవలపర్‌ల నుంచి కమీషన్ ఉండదు కాబట్టి ఇది మరింత చౌకగా ఉంటుంది. మీరు ఏదైనా సబ్‌స్క్రిప్షన్ లేదా యాప్ సర్వీస్‌ను కొనుగోలు చేస్తే యాపిల్, గూగుల్ 30 శాతం కమీషన్ రుసుమును వసూలు చేస్తాయి. అందువల్ల వీటి ధర పెరిగుతుంది. మరోవైపు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కారణంగా ధ్రువీకరించబడిన వినియోగదారులకు సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్‌గా ఉన్నంత వరకు బ్లూ టిక్ మీ ప్రొఫైల్‌లో అలాగే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
వారికి ఊరట
బ్లూ సబ్‌స్క్రిప్షన్ లేనప్పుడు ట్విట్టర్ లెగసీ ఖాతాల నుంచి ట్విట్టర్ బ్లూ టిక్‌ను తొలగిస్తున్నప్పటికీ బ్రాండ్‌లు, పబ్లికేషన్‌లు తమను తాము గుర్తించుకోవడంలో సహాయపడే వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్‌ను ట్విట్టర్ రూపొందిస్తోంది. బ్రాండ్ పేజీ ప్రొఫైల్ పేజీ కంపెనీ లోగోను సూచించే ప్రత్యేక బ్యాడ్జ్‌ను పొందుతుంది. తమ సొంత ఉద్యోగులను ధ్రువీకరించే సామర్థ్యాన్ని కంపెనీలకు కూడా విస్తరిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. ఫలితంగా, సంస్థతో అనుబంధంగా ఉన్న కార్మికులు కంపెనీ లోగోను కలిగి ఉన్న బ్యాడ్జ్‌ను కూడా అందుకుంటారు. తాము ఇప్పటికే 500 కంపెనీలు, లాభాపేక్ష లేని సంస్థలు ధ్రువీకరించబడిన సంస్థలకు చెందిన అనుబంధ ఖాతాలను వారి ప్రొఫైల్‌ల్లో పబ్లిక్‌గా జాబితా చేయడాన్ని కనుగొన్నామని ట్విట్టర్ ప్రతినిధులు చెబుతున్నారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా వెయిట్‌లిస్ట్ నుంచి ఆమోదించినసంస్థలకు ఇమెయిల్ ఆహ్వానాలను పంపుతున్నామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కంపెనీలు వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్ కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలుస్తోంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం