Twitter Payments: వాట్సాప్ బాటలోనే ట్విట్టర్.. త్వరలో డిజిటల్ పేమెంట్స్ ఆప్షన్..
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ ఇలా అన్ని కంపెనీలు తమ యాప్స్ లో యూపీఐ పేమెంట్స్ తో కూడిన చెల్లింపులు చేయడానికి అనుమతిస్తున్నాయి. వీటి తర్వాత వాట్సాప్ కూడా యూపీఐ చెల్లింపులు చేసేలా వినియోగదారులను ప్రోత్సహించింది.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. అలాగే బ్యాంకులు కూడా లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా వివిధ చెల్లింపు పద్ధతులను అవలంభిస్తున్నాయి. అలాగే భారత్ లో నోట్ల రద్దు సమయంలో ఎన్ పీసీఐ ప్రవేశపెట్టిన యూపీఐ చెల్లింపు పద్ధతి ఎక్కువగా జనాధరణ పొందింది. అలాగే బ్యాంకుల వద్ద నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి చెల్లింపులు దాదాపుగా తగ్గిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ ఇలా అన్ని కంపెనీలు తమ యాప్స్ లో యూపీఐ పేమెంట్స్ తో కూడిన చెల్లింపులు చేయడానికి అనుమతిస్తున్నాయి. వీటి తర్వాత వాట్సాప్ కూడా యూపీఐ చెల్లింపులు చేసేలా వినియోగదారులను ప్రోత్సహించింది. ప్రస్తుతం ఇదే బాటలో ట్విట్టర్ కూడా వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేయడానికి ముందు ఇలాంటి చర్చలే నడిచినా మస్క్ సీఈఓ అయ్యాక ఈ ప్రతిపాదన అటకెక్కింది. ప్రస్తుతం మళ్లీ ట్విట్టర్ ద్వారా చెల్లింపులు అనే అంశం తెర మీదకు వచ్చింది.
మస్క్ ట్వీట్టర్ సీఈఓ అయ్యాక కంపెనీ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వాటి నుంచి రక్షణ కోసం అంటూ చాలా మంది ఉద్యోగులను తొలగించాారు. అలాగే ఇతర పరిణామాలు మస్క్ కు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్ ఎడ్వటైజ్ మెంట్ల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోయింది. దీంతో ట్విట్టర్ ప్రతినిధులు ఇతర ఆదాయ మార్గాల వైపు దృష్టి పెడుతున్నారు. దీంతో మళ్లీ ట్విట్టర్ ద్వారా చెల్లింపులు ఫీచర్ ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ట్విట్టర్ లో ప్రొడెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్తేర్ కాఫోర్డ్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ట్విట్టర్ ప్రతినిధులు మాత్రం స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే గతంలో మస్క్ తమ ట్విట్టర్ ను ది ఎవ్రీ థింగ్ యాప్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో ట్విట్టర్ భవిష్యత్ లో కచ్చితంగా చెల్లింపులు ఫీచర్ ను తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..