WhatsApp communities: వాట్సాప్ లో కమ్యూనిటీ అంటే అర్థం ఏమిటీ? గ్రూపులు, కమ్యూనిటీ రెండూ ఒక్కటేనా?
చాలామందికి వాట్సాప్ గ్రూపుల గురించి అవగాహన ఉంటుంది. గానీ వాట్సాప్ కమ్యూనిటీల గురించి పెద్దగా తెలియదు. ఈ ఫీచర్ ను మెటా సంస్థ వాట్సాప్ లో కొద్దికాలం క్రితమే పరిచయం చేసింది. దీనితో వాట్సాప్ గ్రూపులన్నీ కలిపి ఒకే గొడుగు కిందకు తేవచ్చు.
వాట్సాప్ లేనిదే ప్రస్తుత ప్రపంచాన్ని ఊహించడం కష్టం.. ఎందుకంటే స్కూల్ విద్యార్థుల నుంచి పీహెచ్ డీ స్కాలర్ల వరకూ.. సాధారణ వ్యక్తుల నుంచి బిజినెస్ మెన్ వరకూ.. డాక్టర్లు, ఇంజినీర్లు, పొలిటికల్ లీడర్లు, పార్టీలు ఇలా ప్రతి ఒక్కరూ సమాచార మార్పిడికి దీనినే వినియోగిస్తున్నారు. ఆఫీస్ గ్రూపులని, ఫ్యామిలీ గ్రూపులని లెక్కలేనని గ్రూప్స్ తో పాటు కమ్యూనిటీస్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే చాలామందికి వాట్సాప్ గ్రూపుల గురించి అవగాహన ఉంటుంది. గానీ వాట్సాప్ కమ్యూనిటీల గురించి పెద్దగా తెలియదు. ఈ ఫీచర్ ను మెటా సంస్థ వాట్సాప్ లో కొద్దికాలం క్రితమే పరిచయం చేసింది. దీనితో వాట్సాప్ గ్రూపులన్నీ కలిపి ఒకే గొడుగు కిందకు తేవచ్చు. దాదాపు 20 గ్రూపుల వరకూ ఒక కమ్యూనిటీగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈక్రమంలో చాలా మంది అసలు వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీలకు తేడా ఏంటో తెలుసుకొనేందుకు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటి గురించిన పూర్తి, వివరాలు, వాటి ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్ గ్రూప్ అందరికీ తెలిసిందే..
స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్, తోటి ఉద్యోగులు కలిసి తమ అభిప్రాయాలను పంచుకునేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవచ్చు. తాము చెప్పాలనుకున్న విషయం గ్రూపుల్లో పోస్ట్ చేయడం ద్వారా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా, అందరికీ ఒకేసారి చేరుతుంది. ఒక్కో గ్రూపులో 1,024 మంది సభ్యులను చేర్చే అవకాశం ఉంటుంది. గ్రూపులో చాట్ కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ సైతం ఉంటుంది. ఇన్వైట్ లింక్, క్యూఆర్ కోడ్ స్కాన్, లేదంటే అడ్మిన్ పర్మిషన్ తో గ్రూపులో మెంబర్ గా చేరే అవకాశం ఉంటుంది.
మరీ కమ్యూనిటీస్ అంటే..
బంధు మిత్రులు, కాలేజీ, ఆఫీస్ కొలీగ్స్ కలిసి గ్రూపులుగా ఏర్పాటు చేసుకుంటారు. వాటిలో ఏదైనా సమాచారం పంచుకోవాలంటే ప్రతి గ్రూపును సెలక్ట్ చేసి పంపాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకేసారి పలు గ్రూపులకు మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో కమ్యూనిటీలను పరిచయం చేసింది మెటా సంస్థ. 20 గ్రూపులను కలిపి ఒక కమ్యూనిటీగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ కమ్యూనిటీ అడ్మిన్ ఏదైనా విషయాన్ని ర్ చేస్తే 20 గ్రూపుల్లోని సభ్యులందరికీ తెలుస్తుంది. గ్రూప్స్ మాదిరిగానే కమ్యూనిటీస్ లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక గ్రూప్ లోని సభ్యులు మరొక గ్రూప్ సభ్యులతో మాట్లాడాలా? వద్దా? అనేది కూడా కమ్యూనిటీస్ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
కమ్యూనిటీని ఇలా తయారు చేయాలి..
వాట్సాప్ లో చాట్‌ల జాబితా కు కుడి పక్కన గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న మెసేజ్ ఐకాన్ ని క్లిక్ చేయాలి. కనిపిస్తున్న ఆప్షన్స్ లో న్యూ కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ పేరు, వివరణ రాయాలి. ప్రొఫైల్ ఫొటో సెట్ చేయాలి. కమ్యూనిటీ పేరు 24 అక్షరాలకు మించి ఉండకూడదు. మీ కమ్యూనిటీ దేనికి సంబంధించినదో వివరణలో చెప్పాలి. కొత్త కమ్యూనిటీ తయారు చేయడానికి లేదంటే ఇప్పటికే ఉన్నదాన్ని జోడించడానికి, గ్రీన్ యారో చిహ్నాన్ని క్లిక్ చేయాలి. తర్వాత మీరు క్రియేట్ చేసిన కమ్యూనిటీలోకి గ్రూపులను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న గ్రూప్ ను జోడించుకోవచ్చు. లేదంటే కొత్త గ్రూప్ ను సృష్టించుకోవచ్చు. ఈ యాడింగ్ పూర్తయిన తర్వాత గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న గ్రీన్ చెక్ మార్క్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..