AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..

కాలేయం దెబ్బతినడానికి ఆల్కహాల్ మాత్రమే కారణం కాదు. మీరు కొన్ని ఆహారాలను పెద్ద పరిమాణంలో తీసుకుంటుంటే.. కొవ్వు కాలేయం, సిర్రోసిస్, వైఫల్యం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం..ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకోండి..

ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
Liver Health Tips
Shaik Madar Saheb
|

Updated on: Apr 16, 2025 | 11:30 AM

Share

నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు 90 శాతం ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వీటిలో ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం).. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య. కాలేయంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది.. దీని కారణంగా కాలేయం సరిగా పనిచేయలేకపోతుంది. సాధారణంగా దీనికి మద్యం కారణమని భావిస్తారు. కానీ మద్యం తాగని వ్యక్తుల కాలేయాన్ని కుళ్ళిపోయేలా చేసే కొన్ని ఆహారాలు ఉన్నాయని.. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి.. ఫ్యాటీ లివర్ సమస్యను రెండు రకాలుగా పేర్కొంటారు.. ఒకటి.. NAFLD లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యల్లో కనిపిస్తుంది.. రెండవది.. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (AFLD).. ఈ రకం అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఆల్కహాల్‌తో పాటు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు తీవ్రమవుతాయి.

ఎలాంటి ఆహార పదార్థాలు ఫ్యాటీలివర్ కు కారణమవుతాయి.. నిపుణులు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.. ఈ విషయాలను తెలుసుకోండి..

కాలేయ వ్యాధికి కారణమయ్యే ఆహారాలు..

చక్కెర పానీయాలు: సోడా, ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్‌లు ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలు కావచ్చు. వాటిలో అధిక మొత్తంలో చక్కెర, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. మీరు దీన్ని రోజూ తీసుకుంటుంటే, మీరు ఫ్యాటీ లివర్ రోగిగా మారవచ్చు.

ఫ్రెంచ్ ఫ్రైస్ – జంక్ ఫుడ్: ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, చిప్స్ వంటి వేయించిన పదార్థాలు కొవ్వుతో నిండి ఉంటాయి. వీటిలో అధిక స్థాయిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి.. ఇవి కాలేయంలో పేరుకుపోయి కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి.

తెల్ల రొట్టె – పాస్తా: తెల్ల రొట్టె, పాస్తా, ఇతర శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు కూడా కొవ్వు కాలేయ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ ఆహార పదార్థాలలో చాలా చక్కెర ఉంటుంది.. దాదాపు ఫైబర్ ఉండదు. దీని అధిక వినియోగం వల్ల, కాలేయ కొవ్వు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది.

పాల ఉత్పత్తులు: అధిక కొవ్వు ఉన్న పాలు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులు కూడా కొవ్వు కాలేయానికి కారణమవుతాయి. వీటిలో అధిక సంతృప్త కొవ్వులు ఉంటాయి.. ఇవి కాలేయాన్ని కొవ్వుగా మారుస్తాయి.

ప్రాసెస్ చేసిన మాంసాలు: సాసేజ్, బేకన్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో అధిక మొత్తంలో కొవ్వు, ఉప్పు ఉంటాయి. ఈ పదార్థాలు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. కొవ్వు కాలేయం ప్రమాదాన్ని పెంచుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..