Citroen Basalt: ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే..!
భారతదేశంలో ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లు కెప్టెన్లుగా ఉన్న టీమ్‌లను సపోర్ట్ చేస్తున్నారు. భారతీయ క్రికెటర్లలో ఎంఎస్ ధోనీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అతను ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీకీ సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.

సిట్రోయెన్ కంపెనీకు సంబంధించిన సీ3 కారులో ‘డార్క్’ ఎడిషన్‌ను ఇటీవల ప్రకటించింది. సీ3తో పాటు ఎయిర్ క్రాస్, బసాల్ట్ కార్లల్లో బ్లాక్ ఎడిషన్‌ను లాంచ్ చేశారు. ఈ ప్రత్యేక ఎడిషన్లు మూడు వాహనాల టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. సిట్రోయెన్ వాటిని పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది. దీని ధర సంబంధిత ఎక్స్- షోరూమ్ ధరల కంటే రూ. 19,500 ఎక్కువగా ఉంటుంది. అదనంగా భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బసాల్ట్ డార్క్ ఎడిషన్‌కు సంబంధించిన మొదటి యూనిట్ యజమానిగా మారారని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
మూడు సిట్రోయెన్ మోడల్స్ డార్క్ ఎడిషన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్‌తో ఆకట్టుకుంటాయి. ఈ పరిమిత-రన్ మోడల్స్‌లో బాడీ సైడ్ మోల్డింగ్ పై డార్క్ క్రోమ్ యాక్సెంట్లు, చెవ్రాన్ బ్యాడ్జ్, ఫ్రంట్ గ్రిల్ ప్రామాణిక వెర్షన్ల నుంచి వేరు చేసే ఇతర అంశాలుగా ఉంటాయి. అదనంగా బంపర్లు, డోర్ హ్యాండిల్స్ గ్లోస్ బ్లాక్ ట్రీట్మెంట్లతో ఆకట్టుకుంటాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే క్యాబిన్ లోపల కూడా బ్లాక్ ఎడిషన్ థీమ్ కొనసాగుతుంది. బ్లాక్ లెథరెట్ సీట్లు, లెథరెట్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్స్, ‘కార్బన్’ బ్లాక్ ఇంటీరియర్లు ఆకట్టుకుంటాయి. ఇతర ప్రత్యేకమైన అంశాల్లో రెడ్ కలర్ డిటెయిలింగ్, వివిధ టప్ పాయింట్లపై హై-గ్లోస్ ఫినిషింగ్లు ఆకర్షిస్తున్నాయి.
ధరలు ఇలా
- సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ రూ. 12.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- ఎయిర్క్రాస్ డార్క్ ఎడిషన్: రూ. 13.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- సీ3 డార్క్ ఎడిషన్ రూ. 8.38 లక్షలు (ఎక్స్-షోరూమ్)