Robot: ’టెర్మినేటర్ 2‘ రోబో ను తయారు చేసిన శాస్త్రవేత్తలు.. అది చేసే పనులు మీ కళ్లతో చూసినా నమ్మలేరు..

ఇది ఎలా పనిచేస్తుందో చూసేందుకు రోబోను ఓ జైలులో ఉంచి.. దానిని బయటకు వచ్చేలా ఆదేశాలిచ్చారు. దీంతో అది కరిగిపోయి ద్రవ రూపంలో తన శరీరాన్ని మార్చుకొని బయటకు వచ్చి.. తిరిగి యాథాస్థితికి చేరుకుంది. దీనిని పరిశోధకులు వీడియో తీశారు.

Robot: ’టెర్మినేటర్ 2‘ రోబో ను తయారు చేసిన శాస్త్రవేత్తలు.. అది చేసే పనులు మీ కళ్లతో చూసినా నమ్మలేరు..
Terminator Robot
Follow us

|

Updated on: Feb 01, 2023 | 3:40 PM

రోబోలతో విన్యాసాలు చేయించే సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలానే వచ్చాయి. అందులో టెర్మినేటర్ సిరీస్ పెద్ద హిట్. ఆ సిరీస్ లోని టెర్మినేటర్ 2 జడ్జిమెంట్ డే సినిమాను చూసిన వారికి ఓ సీన్ గుర్తు ఉండి ఉంటుంది. టీ-1000 అనే రోబో సెక్యూరిటీ గేట్‌ ఇనుప కడ్డీల నుంచి సులభంగా దూరిపోయి.. తప్పించుకొనే సీన్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఓ బుల్లి రోబోను పరిశోధకులు ఆవిష్కరించారు. ఇది ఒక్క ఆదేశంతో ద్రవస్థితిలోకి మారిపోతుంది. ఆ తర్వాత మళ్లీ తనను తాను పునర్నిర్మించుకొని ఘన స్థితిలోకి మారిపోతుంది. ఈ ఫీచర్ ద్వారా మూసి ఉన్న ప్రదేశాల నుంచి కూడా ఈ రోబో తప్పించుకోగలదు. ఇది వైద్యం సహా అనేక రంగాల్లో సమస్యలను పరిష్కరించే గొప్ప ఆవిష్కరణ అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఎలా పనిచేస్తుందంటే..

దీని గురించి ప్రతి ఒక్కరూ ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై న ఆధారపడి పనిచేస్తుందేమో అనుకుంటారు. కానీ ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేయదు. ఇది ఎలా పనిచేస్తుందంటే.. మాగ్నెటిక్‌ నియోడైమియం, బోరాన్‌, ఇనుము సూక్ష్మభాగాలను తక్కువ ద్రవీభవనస్థానం కలిగిన ద్రవ గాలియంలో అమర్చారు. మాగ్నెటిక్‌ ఇండక్షన్‌ ద్వారా రోబోను వేడి చేసినప్పుడు గాలియం కరిగిపోతుంది. వెంటనే రోబో ద్రవస్థితిలోకి మారిపోతుంది. అనంతరం మళ్లీ తనకుతాను పునర్మిర్మించుకొని రోబోలా మారిపోతుంది. ఇందులోని అయస్కాంత కణాలు రోబో ముందుకు కదిలేందుకు, అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా ప్రతిస్పందించే సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ రోబోను పరిశోధకులు ‘సీ కుకుంబర్‌’ అనే జీవి స్ఫూర్తితో తయారుచేశారు. ఇది ఎలా పనిచేస్తుందో చూసేందుకు రోబోను ఓ జైలులో ఉంచి.. దానిని బయటకు వచ్చేలా ఆదేశాలిచ్చారు. దీంతో కరిగిపోయి ద్రవ రూపంలో బయటకు వచ్చి.. తిరిగి యాథాస్థితికి చేరుకుంది. దీనిని పరిశోధకులు వీడియో తీశారు. ఆ వీడియో ఇదిగో మీరూ చూసేయండి..

ఇవి కూడా చదవండి

ద్రవ, ఘన స్థితుల మధ్య తన దేహాన్ని మార్చుకోగలిగే సామర్థ్యాన్ని రోబోలకు ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైందని ఈ అధ్యయన ప్రధాన సైంటిస్ట్ ప్రోఫెసర్ చెంగ్ ఫెంగ్ అన్నారు. రోబోను లిక్విడ్ మారమని కమాండ్ ఇచ్చేందుకు మాగ్నెట్ను వినియోగించామన్నారు. మాగ్నెటిక్ ఇండక్షన్ ప్రక్రియ ద్వారా రోబోను వేడి అయ్యేలా చేశామని తెలిపారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..