AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ! పోలీసుల విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు

ఫ్లోరిడాలోని ఒక మహిళ ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ ద్వారా మానవ ఎముకలను అమ్ముతూ పట్టుబడింది. కింబర్లీ స్కాపర్ అనే 52 ఏళ్ల ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె 'వికెడ్ వండర్‌ల్యాండ్' అనే దుకాణం ద్వారా పుర్రెలు, పక్కటెముకలు వంటి ఎముకలను విక్రయించింది. పోలీసుల దర్యాప్తులో ఆమె చాలా సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది.

వామ్మో.. నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ! పోలీసుల విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు
Women Sells Human Skulls
SN Pasha
|

Updated on: Apr 16, 2025 | 11:22 AM

Share

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఒక మహిళ ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ ద్వారా పుర్రెలు, పక్కటెముకలు సహా మానవ ఎముకలను ఆన్‌లైన్ అమ్ముతూ వ్యాపారం చేస్తోంది. విషయం పోలీసులుకు తెలిసి ఆమెను అరెస్టు చేశారు. 52 ఏళ్ల కింబర్లీ స్కాపర్ చట్టవిరుద్ధంగా మనుషుల పుర్రెలు, ఎముకలను అమ్మడం, కొనుగోలు చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఫ్లోరిడాలోని ఆరెంజ్ సిటీలో ఉన్న తన ‘వికెడ్ వండర్‌ల్యాండ్’ వ్యాపారం నుంచి ఎముకలను కొనుగోలు చేసి కింబర్లీ ఇతరులకు విక్రయించిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని, ఏప్రిల్ 11న వోలుసియా కౌంటీ జైలు నుండి 7,500 డాలర్లు (సుమారు రూ. 6.45 లక్షలు) జామీపై విడుదల చేశారు.

కొన్నేళ్లుగా ఇదే పని..

ఫేస్‌బుక్ పేజీ ద్వారా మానవ ఎముకల అమ్మకానికి సంబంధించిన సమాచారం ఆరెంజ్ సిటీ పోలీసులకు అందిన తర్వాత, డిసెంబర్ 21, 2023న దర్యాప్తు ప్రారంభమైంది. ఆ సమాచారం అందించిన వ్యక్తి అధికారులకు వ్యాపారం ప్రొఫైల్‌లో అమ్మకానికి ఉన్న ఎముకల చిత్రాలను అందించాడు. ఆరెంజ్ సిటీలోని నార్త్ వోలుసియా అవెన్యూలో ఉన్న ‘వికెడ్ వండర్‌ల్యాండ్’ అనే వ్యాపారాన్ని గుర్తించారు. ఆ తర్వాత స్టోర్ వెబ్‌సైట్‌ను పరిశీలించగా కొనుగోలుకు అందుబాటులో ఉన్న అనేక రకాల మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిలో రెండు మానవ పుర్రెలు, ఒక క్లావికిల్, స్కాపులా, ఒక పక్కటెముక, ఒక వెన్నుపూస, ఒక పాక్షిక పుర్రె ఉన్నాయి. పోలీసులు అవశేషాలను సేకరించి తదుపరి విచారణ కోసం ల్యాబ్‌కు పంపించారు. అయితే అసలు కింబర్లీకి ఆ ఎముకలు అమ్ముతున్న దుకాణ యజమానితో పోలీసులు విచారించడంతో తాము చాలా సంవత్సరాలుగా మానవ ఎముకలను అమ్ముతున్నామని, ఫ్లోరిడాలో అలాంటి అమ్మకాలు నిషేధించబడ్డాయని తమకు తెలియదని అన్నారు.

అయితే ఈ ఎముకల వ్యాపారం గురించి ఆ మహిళ మాట్లాడుతూ.. తన వద్ద ఉన్న ఎముకలు ప్రైవేట్ విక్రేతల నుండి కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని కూడా పోలీసులకు వెల్లడించింది. ఆ ఎముకలు నిజమైన మానవ అవశేషాలు, సున్నితమైనవిగా పేర్కొంది. ఆ ఎముకలు విద్యా నమూనాలు అని, రాష్ట్ర చట్టం ప్రకారం వాటి చట్టబద్ధమైన అమ్మకానికి అనుమతి ఉందని ఆమె వాదించారు. అవశేషాలను పరిశీలించిన నిపుణులు కొన్ని ఎముకలు పురావస్తు శాస్త్రానికి సంబంధించినవి కావచ్చని నిర్ధారించారు. ఒక పుర్రె ముక్క 100 సంవత్సరాల కంటే పాతదిగా భావిస్తున్నారు, మరొక ఎముక 500 సంవత్సరాల కంటే పాతదిగా ఉన్నట్లు ల్యాబ్‌ టెస్టుల్లో తేలినట్లు సమాచారం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.