Liver Health: మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి..!
కాలేయంలో పేరుకుపోయే కొవ్వు అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అయితే సహజమైన డ్రింక్స్ లను సమయానికి తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు. అల్లం టీ నుంచి నిమ్మకాయ నీటి వరకు ఇవి అన్ని కూడా కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి.

కాలేయం శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది జీవక్రియ, శరీర డిటాక్స్ ప్రక్రియ, ఆహార జీర్ణక్రియ వంటి అనేక ముఖ్యమైన పనుల్లో పాల్గొంటుంది. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ఎక్కువగా ప్యాకెజ్డ్ ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటివి కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. దీనిని ఫ్యాట్ లివర్ అంటారు. దీన్ని అరికట్టేందుకు సహజంగా కొన్ని డ్రింక్స్ ఎంతగానో సహాయపడుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టీ
అల్లంలో ఉండే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా అల్లం టీ సేవించడం ద్వారా కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమవుతుంది. రోజు ఒకసారి అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మలినాలను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రంగా ఉంచతాయి. ఇది జీవక్రియ వేగాన్ని పెంచి, కొవ్వు కరుగడాన్ని ప్రోత్సహిస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తాగడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు.
కలబంద రసం
కలబందలో ఉండే సహజ ఎంజైములు శరీరంలో పేరుకున్న కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. ఇది కాలేయానికి పని తక్కువ చేసి దాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాలేయ సంబంధిత సమస్యలున్న వారికి ఇది గొప్ప సహాయం చేస్తుంది.
బ్లాక్ కాఫీ
బ్లాక్ కాఫీతో శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు పెరిగి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఇది ఫ్యాటీ లివర్ రూపంలో వచ్చే రోగాల నుంచి రక్షణ కల్పించగలదు. అయితే దీనిని అధికంగా కాకుండా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
ఉసిరి రసం
ఉసిరి లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది కాలేయ కణాల పనితీరును మెరుగుపరచడంలో దోహదపడుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకుంటే కాలేయాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
పసుపు కలిపిన పాలు
వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం వల్ల కాలేయ కణాల పునరుత్పత్తి వేగంగా జరుగుతుంది. ఇది శరీరాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రకు ముందు ఇది తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది.
బీట్రూట్ రసం
బీట్రూట్ లో ఉండే పోషకాలు, నైట్రేట్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జీవక్రియను సజావుగా ఉంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
నిమ్మకాయ నీరు
నిమ్మకాయ నీటిని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది కాలేయంపై వచ్చే ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం ఉత్తమమైన సహజ మార్గం. ఈ డ్రింక్స్ రోజూ సరైన విధంగా తీసుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)