Indian Railway: ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. ఏకంగా 6 శాతం తగ్గింపు.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
రైలు టికెట్లు బుక్ చేసుకునేవారికి భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. టికెట్ల బుకింగ్‌పై 6 శాతం రాయితీ ప్రకటించింది. ఇందుకోసం రైల్ వన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఆఫర్ వర్తిస్తుంది.

ప్రయాణికులకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. రైల్వే టికెట్ల బుకింగ్‌పై ఏకంగా 6 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అన్ రిజర్వుడ్ జనరల్ టికెట్లపై ఈ ఆఫర్ వర్తించనుంది. ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేందుకు రైల్ వన్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్ టికెట్లు బుక్ చేసుకుంటే 3 శాతం డిస్కౌంట్ లభించనుంది. అలాగే ఈ యాప్‌లో ఆర్ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే మరో 3 శాతం రాయితీ లభించనుంది. ఇలా టికెట్లపై మొత్తం 6 శాతం డిస్కౌంట్ రానుంది. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ నుంచి జులై 14వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
డిసెంబర్ 30న లేఖ
రైల్ వన్ యాప్ ద్వారా అన్ రిజర్వుడ్ టికెట్ల బుకింగ్‌పై ఏ మోడ్‌లో పేమెంట్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ ఆఫర్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)కు రైల్వేశాఖ డిసెంబర్ 30న లేఖ రాసింది. ఆర్ వ్యాలెట్ వినియోగదారులకు మాత్రమే కాకుండా యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే చెల్లింపులకు ఈ డిస్కౌంట్ లభించనుంది. దీంతో జనవరి 14 నుంచి ఆర్ వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేసేవారికి 6 శాతం డిస్కౌంట్ వస్తుందన్నమాట.
రైల్ వన్ యాప్ అంటే..
మొన్నటివరకు వివిధ రైల్వే సేవలకు వివిధ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉండేవి. టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ, రైళ్ల లైవ్ ట్రాకింగ్ తెలుసుకోవడానికి NETS, ఇక ఫిర్యాదుల కోసం రైల్ మసద్ యాప్ ఉపయోగించాల్సి వచ్చేది. ఇక రైల్లో ఆహారం కోసం ఫుడ్ఆన్ ట్రాక్ యాప్ అందుబాటులో ఉండేది. కానీ అన్నీ సేవలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ రైల్ వన్ పేరుతో కొత్త యాప్ 2025లో లాంచ్ చేసింది. ఈ యాప్‌ను అందరూ ఉపయోగించేలా చేసేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తోంది.
