Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple AR Headset: యాపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో ఏఆర్ హెడ్ సెట్

మొబైల్స్ మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తులను కూడా ఆపిల్ కంపెనీ రిలీజ్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ఇయర్ పాడ్స్ వంటివి ఉన్నాయి.

Apple AR Headset: యాపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో ఏఆర్ హెడ్ సెట్
Ar Set
Follow us
Srinu

|

Updated on: Feb 01, 2023 | 2:44 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ ఉత్పత్తులు యువత మనస్సును దోచుకుంటున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ రంగంలో ఆపిల్ తనదైన ముద్ర వేయడంతో యువత ఎక్కువగా ఆపిల్ ఫోన్ వాడడానికి ఇష్టపడుతున్నారు. సెక్యూరిటీ పరంగా బాగుండడంతో ఉన్నత వర్గాల వారు కూడా ఆపిల్ ఫోన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలా సమాజంలోని కొన్ని వర్గాలను ఆపిల్ ఆకర్షిస్తుంది. అలాగే ఆపిల్ ఫోన్ వాడడం అనేది ఓ స్టేటస్ సింబల్ లా పలువురు ఫీలవుతారు. ఇంతలా యాపిల్ తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. కేవలం మొబైల్స్ మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తులను కూడా ఆపిల్ కంపెనీ రిలీజ్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ఇయర్ పాడ్స్ వంటివి ఉన్నాయి. అయితే ఈ వెర్షన్ లో ఆ కంపెనీ కొంచెం ముందుకు వెళ్తున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. భవిష్యత్ ఆపిల్ కంపెనీ కొత్త ఏఆర్ హెడ్ సెట్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. 

ఆపిల్ కంపెనీ భవిష్యత్ లో ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ), ఎంఆర్(మిక్స్ డ్ రియాలిటీ) ద్వారా యూజర్లు మంచి హెడ్ సెట్ అనుభూతిని పొందెలా పరిశోధనలు చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆపిల్ ఇన్ సైడర్ వంటి నివేదికల ప్రకారం తన ఎంఆర్ హెడ్ సెట్ ద్వారా వ్యాయామం, ధ్యానం వంటి వాటికి ఉపయోగపడేలా కొత్త ప్రొడెక్ట్ ను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుంది. తన ఎంఆర్ హెడ్ సెట్ లో సొంత ఏఆర్ అప్లికేషన్లను ప్రవేశపెట్టడానికి చూస్తుంది. అలాగే ఈ కొత్త యాప్ ఆపిల్ స్టోర్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో చివరిలో దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వినియోగదారులు తమ ఎంఆర్ సెట్ నుంచే తమకు కావాల్సిన ఏఆర్ అప్లికేషన్ ను సృష్టించేలా యాప్ ను రూపొందించారు. ఇది కంప్యూటర్ కోడ్ తెలియని వారికి చాలా బాగా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అలాగే మరో నివేదికలో అయితే ఈ నెలలోనే ఆపిల్ ఎంఆర్ సెట్ ను రిలీజ్ చేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కంపెనీ ఈ ఎంఆర్ సెట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..