Sony Walkman: మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సోనీ వాక్ మ్యాన్.. అధునాతన ఫీచర్లు, అత్యుత్తమ సౌండింగ్.. అస్సలు మిస్ అవ్వకండి..
స్మార్ట్ ఫోన్ లు, ఐ ప్యాడ్ లు, ఐ పోడ్ లు వచ్చేసి వాక్ మ్యాన్ స్థాన్నాన్ని ఆక్రమించేశాయి. అయితే సోనీ కంపెనీ మళ్లీ వాక్ మ్యాన్ సరికొత్త మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. అనేక ఫీచర్లు యాడ్ చేసి, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ సౌండ్ క్లారిటీతో దీనిని మళ్లీ ఆవిష్కరించింది.
వాక్ మ్యాన్.. ఇప్పటి తరానికి పెద్ద పరిచయం లేని పేరు. కానీ 90ల్లో సంగీత ప్రియుల్లో దీనికి ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లు, ఐ ప్యాడ్ లు, ఐ పోడ్ లు వచ్చేసి దాని స్థాన్నాన్ని ఆక్రమించేశాయి. అయితే సోనీ కంపెనీ మళ్లీ వాక్ మ్యాన్ సరికొత్త మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. అనేక ఫీచర్లు యాడ్ చేసి, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ సౌండ్ క్లారిటీతో దీనిని మళ్లీ ఆవిష్కరించింది. దాని పేరు సోనీ ఎన్ డబ్ల్యూ జెడ్-ఎక్స్ 707(NW-ZX707). దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అత్యుత్తమ సౌండింగ్..
భారతీయ సంగీత ప్రియులను దృష్టిలో పెట్టుకొని సోనీ సంస్థ దీనిని తయారు చేసినట్లు పేర్కొంది. మంచి సొగసైన లుక్ లో దీనిని డిజైన్ చేసింది. దీనిలో ఎస్ మాస్టర్ హెచ్‌ఎక్స్ డిజిటల్ ఆంప్ టెక్నాలజీని వినియోగించింది. హై-రెస్ ఆడియో వైర్‌లెస్‌తో సౌండ్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇది వాక్‌మ్యాన్ ఆడియో క్వాలిటీని పెంచుతుంది.
ధర, ఫీచర్స్..
ఈ కొత్త సోనీ వాక్‌మ్యాన్‌లో 5 అంగుళాల డిస్‌ప్లే, వై-ఫై సామర్థ్యం, మ్యూజిక్ స్ట్రీమింగ్, డౌన్‌లోడ్ సామర్థ్యం, స్లిమ్ డిజైన్ ఉన్నాయి. ఇంటర్నల్ బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై 25 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. అధునాతన ఫైన్ ట్యూన్డ్ కెపాసిటర్లు, FTCAP3, సాలిడ్ హై పాలిమర్ కెపాసిటర్ ఉంటుంది. సోనీ వాక్‌మ్యాన్ మోడల్‌లో ఎడ్జ్ AI, DSEE అల్టిమేట్, రియల్ టైమ్‌లో డిజిటల్ మ్యూజిక్ ఫైల్‌ల అప్‌స్కేలింగ్ ఉన్నాయి. దీని ధర కేవలం రూ. 69,990గా నిర్ణయించారు. ఈ డివైజ్ జనవరి 30 నుంచి హెడ్‌ఫోన్ జోన్‌లో ప్రత్యేకంగా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. వాక్‌మ్యాన్ క్లాసిక్ బ్లాక్ అండ్ గోల్డ్ వేరియంట్‌లో రిలీజ్ అయింది. ఈ డివైజ్ ప్యూరిస్టుల కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డివైజ్ ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 కన్నా ఎక్కువ ఖర్చవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..