UPI PIN with Aadhar: డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ యాక్టివేషన్.. ఇకపై ఆధార్ ఉంటే చాలు.. మరి ఎలా చేయాలంటే..
గూగుల్ పే, భీమ్, ఫోన్‌పే తదితర యాప్స్‌లో యూపీఐ యాక్టివేషన్ కోసం డెబిట్‌కార్డు తప్పనిసరిగా ఉండేది. అనుకోకుండా డెబిట్ కార్డు ఎక్కడైనా పోతే ఇక అంతే సంగతి. కానీ ఇప్పుడు డెబిట్..
ప్రస్తుత కాలంలో చాలా వరకు చెల్లింపులన్నీ యూపీఐ యాప్స్ ద్వారానే అయిపోతున్నాయి. అందుకు ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపుల కాలం కావడమే కారణమని చెప్పుకోవాలి. ప్రతిసారి డెబిట్ కార్డుతో ఏటీఎం సెంటర్‌కెళ్లి డబ్బు డ్రా చేయాలంటే మనకు కూడా కష్టంగా ఉంటుంది కదా.. అయితే గూగుల్ పే, భీమ్, ఫోన్‌పే తదితర యాప్స్‌లో యూపీఐ యాక్టివేషన్ కోసం డెబిట్‌కార్డు తప్పనిసరిగా ఉండేది. అనుకోకుండా డెబిట్ కార్డు ఎక్కడైనా పోతే ఇక అంతే సంగతి. కానీ ఇప్పుడు డెబిట్ కార్డుతో సంబంధం లేకుండా.. ఆధార్ నంబర్‌తో యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు. డెబిట్‌కార్డుతో యూపీఐ యాక్టివేషన్ వల్ల ప్రక్రియతో కొన్ని ప్రతిబంధకాలు వచ్చాయి. చాలా మందికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. డెబిట్ కార్డు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన ఖాతాదారుల వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ‘మీకు ఈ విషయం తెలుసా..? మీరు యూపీఐ యాక్టివేట్ చేసుకోవడానికి డెబిట్ కార్డు వాడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు స్కాన్ చేసి యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం https://bit.ly/3V9NOw3ను సందర్శించాల’ని పీఎన్బీ ట్వీట్ చేసింది.
Did you know? You don’t need your Debit card to register for UPI.
Ride the UPI wave with Aadhaar Card and scan away! For more info, visit: https://t.co/Vj7OfmkLEp #UPI #AadhaarCard #Digital #Banking #Transaction pic.twitter.com/HpJG6mnU9A
— Punjab National Bank (@pnbindia) January 29, 2023
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెబ్‌సైట్ ప్రకారం ‘డెబిట్ కార్డు లేని వారు యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై చెల్లింపులు జరుపడానికి ఆధార్ ఓటీసీ బెటర్ తేలిక మార్గం. ఆధార్ కార్డుతో యూపీఐ ప్లాట్‌ఫామ్ రీసెట్ చేసుకోవచ్చు’.
ఆధార్ నంబర్‌తో యూపీఐ పిన్ సెట్ చేసుకోండిలా..
- న్యూ యూపీఐ పిన్ సెట్ చేసుకోవడానికి యూపీఐ యాప్ ఎంచుకోవాలి.
- ధృవీకరణ కోసం ఆధార్ కార్డు సమాచారం నమోదు చేయాలి.
- కన్సెంట్ ప్రొవైడ్ చేసి, యాక్సెప్ట్ చేయాలి.
- ఆధార్ కార్డులోని చివరి ఆరు అంకెలను నమోదు చేసి చెల్లుబాటు చేసుకోవాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ నమోదు చేయాలి.
- కన్సెంట్ ప్రొవైడ్ చేసి, యాక్సెప్ట్ చేయాలి.
- బ్యాంకు ఖాతా చెల్లుబాటైన తర్వాత కొత్త యూపీఐ పిన్ నంబర్ నమోదు చేసి, ధృవీకరించుకోవాలి.
- ఎన్పీసీఐ వెబ్‌సైట్ ప్రకారం `ఆధార్ కార్డు నంబర్‌ను ఉపయోగించి ప్రతి యూపీఐ పిన్ నంబర్ సెట్ చేయడానికి కస్టమర్ సమ్మతి తీసుకోవాలి.
- ఆధార్ కార్డ్ నంబర్‌తో పాటు బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ నంబర్ వచ్చిన తర్వాత కస్టమర్లు తమ యూపీఐ పిన్ నంబర్లు సెట్ చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి