Apple Says No to Layoffs: అన్ని టెక్ కంపెనీలు ఒక వైపు.. యాపిల్ ఒక్కటే ఒక వైపు.. ఉద్యోగుల కోసం ఈ కంపెనీ సీఈఓ ఎంత పని చేశాడో తెలుసా..

మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 219 కంపెనీలు 68,000 ఉద్యోగులను తొలగించాయి. కానీ ఒక్క సంస్థ మాత్రం కోవిడ్ పాన్ డెమిక్ నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగిని కూడా తీసివేయలేదు. కనీసం వారి శాలరీలో కూడా కోత విధించలేదు. ఎందుకంటే ఆ కంపెనీకి ఉన్న సీఈవో చొరవ వల్ల .

Apple Says No to Layoffs: అన్ని టెక్ కంపెనీలు ఒక వైపు.. యాపిల్ ఒక్కటే ఒక వైపు.. ఉద్యోగుల కోసం ఈ కంపెనీ సీఈఓ ఎంత పని చేశాడో తెలుసా..
Apple Tim Cook
Follow us

|

Updated on: Feb 01, 2023 | 1:19 PM

ఎటుచూసినా ఆర్థిక మాంద్యం భయాలు.. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియని ఆందోళన.. ముఖ్యంగా టెక్ కంపెనీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీల్లోనూ సిబ్బంది సంఖ్యలో కోత విధించాయి. వేల సంఖ్యలో ఉద్యోగులకు ఇంటికి పంపించాయి. ఈ లేఆఫ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 219 కంపెనీలు 68,000 ఉద్యోగులను తొలగించాయి. కానీ ఒక్క సంస్థ మాత్రం కోవిడ్ పాన్ డెమిక్ నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగిని కూడా తీసివేయలేదు. కనీసం వారి శాలరీలో కూడా కోత విధించలేదు. ఎందుకంటే ఆ కంపెనీకి ఉన్న సీఈవో చొరవ వల్ల . తన శాలరీని దాదాపు 40 శాతం తగ్గించుకొని, ఒక్క ఉద్యోగం కూడా తీయకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరా సీఈఓ? ఎంటా ఆ కంపెనీ పూర్తి వివరాలు..

యాపిల్ అందరికీ ఆదర్శం..

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగి ని కూడా ఆర్థిక మాంద్యం బూచిని చూపించి తీసివేయలేదు. తీసివేసే ప్లానింగ్ కూడా చేయడం లేదు. ఆర్థిక నష్టాలు, మాంద్యం భయాలు ఎన్ని ఉన్నా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది ఆ కంపెనీ. దీనికి ప్రధాన కారణంగా ఆ కంపెనీ సీఈఓ అయిన టిమ్ కుక్. ఆయన చొరవ, సానుకూల దృక్పథం, మానవత్వ ధోరణి వల్ల ఇది సాధ్యమైంది. ఆయన వేతనాన్ని తగ్గించుకొని ఉద్యోగులకు భద్రత కల్పించారు. 2023 దాదాపు 40 శాతానికి పైగా తన జీతంలో ఆయనకు ఆయనే కోత విధించుకున్నారు.

 హాల్ ఆఫ్ ఫేమ్..

యాపిల్ సీఈవో టిమ్ కుక్ ను చాలా మంది టెక్ నిపుణులు సీఈఓల హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు కల్పిస్తారు. ఎందుకంటే ఆయన తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్లనే. కోవిడ్ పాన్ డెమిక్ నుంచి మిగిలిన టెక్ కంపెనీల్లా యాపిల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు రిక్రూట్ చేసుకోలేదు. అలాగే ఒక్క ఉద్యోగాన్ని తీసివేయలేదు. దానిలోని ఉద్యోగుల సంఖ్య ఎంతో కొంత పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. 2021తో పోల్చితే 2022 లో యాపిల్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 7 శాతం పెరిగింది.

ఇవి కూడా చదవండి

యాపిల్ సీఈఓ జీతం ఎంత..

యాపిల్ సీఈఓ కుక్ తన జీతాన్ని దాదాపు 40 శాతం తగ్గించుకున్నారు. యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్ చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) ప్రకారం కుక్ దాదాపు 35 మిలియన్ డాలర్లను తనకు తాను కోత విధించుకున్నారు. 2022లో 84 మిలియన్ డాలర్లు ఉన్న ఆయన వేతనం 2023 నాటికి 49 మిలియన్ డాలర్లకు చేరింది. ఈ చర్య కారణంగా ఆ కంపెనీలో ఒక్క ఉద్యోగిని కూడా తీసివేయలేదు.

ఇబ్బందులు ఉన్నా..

మిగిలిన టెక్ కంపెనీల మాదిరిగానే యాపిల్ కూడా కోవిడ్ కారణంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. ముఖ్యంగా సప్లై చైన్ విధానంలో తిప్పలు పడింది.  చైనాలోని తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లపై కోవిడ్ వైరస్ ఎఫెక్ట్ బాగా పడింది. ఫలితంగా దాని ఎకానమీ కూడా బాగా దెబ్బతింది. అయినప్పటికీ సీఈఓ చర్య వల్ల ఒక్క ఉద్యోగిని కూడా ఆ కంపెనీ తొలగించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..