Apple AirPods Pro: యాపిల్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 27 వేల ఎయిర్‌పాడ్స్‌ను రూ. 1,150కే సొంతం చేసుకునే అవకాశం.
యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాపిల్ కంపెనీ నుంచి ఏ ప్రొడక్ట్ విడుదలైనా ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జోరందుకుంటాయి. అయితే ధర విషయంలో మాత్రం యాపిల్ ప్రొడక్ట్స్ షాక్ కొడతాయి. అందుకే చాలా మంది ఈ బ్రాండ్‌కు సంబంధించిన...
యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాపిల్ కంపెనీ నుంచి ఏ ప్రొడక్ట్ విడుదలైనా ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జోరందుకుంటాయి. అయితే ధర విషయంలో మాత్రం యాపిల్ ప్రొడక్ట్స్ షాక్ కొడతాయి. అందుకే చాలా మంది ఈ బ్రాండ్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నా వెనుకగుడు వేస్తారు. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ మీలాంటి వారి కోసమే ఓ బంపరాఫర్ తీసుకొచ్చింది.
యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోపై అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. హెచ్2 చిప్‌తో తయారు చేసిన ఈ యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 26,900గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో భాగంగా రూ. 21,400కే అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఇంతటితో ఆగిపోలేదు పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మరితం తక్కువ ధరకు ఇయర్ బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఏదైనా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 19,000 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఇయర్ బడ్స్‌ను రూ. 1250కి సొంతం చేసుకునే అవకాశం కలిపించింది.
అయితే ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో చివరిగా రూ. 26,900 ఉన్న ఇయర్ బడ్స్‌ను రూ. 1150కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఇయర్ బడ్స్ ఫీచర్స్ విషయానికొస్తే ఇందులో ప్రత్యేకంగా బ్యాగ్రౌండ్ నాయిస్‌ను తగ్గించే టెక్నాలజీని అందించారు. సౌండ్ క్లారిటీ విషయంలోనూ ఈ ఇయర్ బడ్స్ పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ వంటి ఫీచర్‌ను అందించారు. బ్యాటరీ విషయంలో కూడా ఈ ఇయర్ బడ్స్ ఎక్కువ కాలం రన్ టైమ్ అందిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..