Motorola G62 5G: మీరు కలలో కూడా ఊహించని ఆఫర్‌.. రూ. 20 వేల 5జీ ఫోన్‌ రూ. 10 వేలకే..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jan 24, 2023 | 5:14 PM

ఇటీవల సీజన్‌తో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్లు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. మొన్నటికి మొన్న బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ సేల్‌తో వినియోగదారులను అట్రాక్ట్‌ చేసిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఎలక్ట్రానిక్‌ సేల్‌ పేరుతో...

Motorola G62 5G: మీరు కలలో కూడా ఊహించని ఆఫర్‌.. రూ. 20 వేల 5జీ ఫోన్‌ రూ. 10 వేలకే..
Motorola G62 5g

ఇటీవల సీజన్‌తో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్లు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. మొన్నటికి మొన్న బిగ్‌ సేవింగ్స్‌ డేస్‌ సేల్‌తో వినియోగదారులను అట్రాక్ట్‌ చేసిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఎలక్ట్రానిక్‌ సేల్‌ పేరుతో ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే మోటొరొలా కంపెనీకి చెందిన జీ62 స్మార్ట్‌ వాచ్‌పై కళ్లు చెదిరే ఆఫర్‌ను అందిస్తోంది.

మోటోరోలో జీ62 5జీ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 21,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ. 14,999కే అందిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకుల డెబిట్‌, కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. గరిష్టంగా రూ. 750 తగ్గింపు ధరకు పొందొచ్చు. అయితే ఆఫర్లు ఇప్పటితో ఆగిపోలేవు.. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా మరింత తక్కువ ధరకు ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా రూ. 5000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 10 వేలలోపు సొంతం చేసుకోవచ్చు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో అందించిన ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ లిథియం పాలీమార్‌ 5జీ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్‌+8 మెగాపిక్సెల్‌ + 2 మెగా పిక్సెల్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu