Jio Recharge: జియో నుంచి అదిరిపోయే రీచార్జ్ ప్లాన్స్.. రూ.399, రూ.899తో మతిపోయే ఆఫర్స్
ప్రస్తుతం దేశమంతా 5 జీ ఫీవర్ నెలకొని ఉన్న నేపథ్యంలో వీఐ, ఎయిర్ టెల్ కు ప్లాన్స్ కు పోటీనిస్తూ కొత్త రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, పరిమిత డేటా, జియో యాప్స్ సబ్స్కిప్షన్ వంటి వాటిని అందిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటాతో డేటా ఎక్కువ వాడే వారిని ఆకర్షిస్తూ కొత్త ప్లాన్స్ ను లాంచ్ చేసింది.
భారతదేశంలో తొలిసారి 4 జీ నెట్ వర్క్ ను లాంచ్ చేసిన జియో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లను ఇస్తుంది. ప్రస్తుతం దేశమంతా 5 జీ ఫీవర్ నెలకొని ఉన్న నేపథ్యంలో వీఐ, ఎయిర్ టెల్ కు ప్లాన్స్ కు పోటీనిస్తూ కొత్త రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, పరిమిత డేటా, జియో యాప్స్ సబ్స్కిప్షన్ వంటి వాటిని అందిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటాతో డేటా ఎక్కువ వాడే వారిని ఆకర్షిస్తూ కొత్త ప్లాన్స్ ను లాంచ్ చేసింది. అంతే కాకుండా ఈ ఏడాది చివరికి దేశంలోని ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో 5 జీ సేవలను ప్రారంభిస్తామని పేర్కొంది. ప్రస్తుతం రూ.399, రూ.899 ప్లాన్స్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ప్లాన్స్ ద్వారా వచ్చే సదుపాయాలేంటో ఓ సారి చూద్దాం.
రూ.399 ప్లాన్
జియో రూ.399 ప్లాన్ లో రోజు 2.5 జీబీ డేటా లెక్కన నెలకు 75 జీబీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. అలాగే రోజు 100 ఎస్ ఎంఎస్ లు పంపించుకునే వెసులుబాటు ఉంది. జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి జియో యాప్స్ యాక్సెస్ ను ఉచితంగా పొందవచ్చు. అలాగే అర్హత ఉన్న వినియోగదారులు 5 జీ యాక్సెస్ ను కూడా పొందుతారు.
రూ.899 ప్లాన్
రూ.349 ప్లాన్ లోని బెన్ ఫిట్స్ రూ.899 ప్లాన్ లో ఉంటాయి. కాకపోతే ఈ ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం 90 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్ లో వినియోగదారుడు 225 జీబీ డేటాను పొందుతారు. అంటే రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది. అలాగే డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ మాత్రం 64 కేబీపీఎస్ కు తగ్గిపోతుంది. ఈ ప్లాన్ లో జియో వెల్కమ్ 5 జీ ఆఫర్ ను పొందుతారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..