AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL: ఓటీటీ లవర్స్‌కి బంపరాఫర్‌.. రూ. 249కే 8 ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం.

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే వినోద రంగంపై కూడా ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా థియేటర్లను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను రీప్లేస్‌ చేశాయి. థియేటర్లు మూతపడడంతో జనాలు ఓటీటీ సేవలకు జై కొట్టారు. దీంతో ఓటీటీ సేవలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది...

BSNL: ఓటీటీ లవర్స్‌కి బంపరాఫర్‌.. రూ. 249కే 8 ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం.
Ott
Narender Vaitla
|

Updated on: Jan 24, 2023 | 3:31 PM

Share

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే వినోద రంగంపై కూడా ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా థియేటర్లను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను రీప్లేస్‌ చేశాయి. థియేటర్లు మూతపడడంతో జనాలు ఓటీటీ సేవలకు జై కొట్టారు. దీంతో ఓటీటీ సేవలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మూవీ మేకర్స్‌ సైతం చిత్రాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయడంతో వీటికి ఆదరణ మరింత పెరిగింది. దీంతో టెలికం, బ్రాండ్‌ బ్యాండ్ సంస్థలు సైతం ఓటీటీ సేవలు పొందడానికి ప్రత్యేక ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. బ్రాడ్‌బాండ్‌ ప్లాన్స్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా తక్కువ ధరకు అందిస్తోంది. రూ. 249 ప్రత్యేక రీచార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకున్న వారికి 8 రకాల ఓటీటీ యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. దీంతో బీఎఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లు ఒక్క రీచార్జ్‌ ఎంచక్కా 8 ఓటీటీ సేవలను పొందొచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోన్న ఈ కొత్త ప్లాన్‌ ద్వారా సోనీ లివ్‌, జీ5, వూట్‌ సెలక్ట్‌, యప్‌ టీవీ, ఆహా, లయన్స్‌గేట్‌ ప్లే, హంగామా, డిస్నీ హాట్‌ స్టార్‌ ఓటీటీ యాప్‌లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను పూర్తి ఉచితంగా పొందొచ్చు. ఇదిలా ఉంటే బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న ఈ కొత్త ప్లాన్‌తో యూజర్లకు మరో ప్రయోజనం కూడా ఉంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకున్న యూజర్లు.. ఓటీటీ సేవలను టీవీ, స్మార్ట్‌ ఫోన్‌, టాబ్లెట్‌, కంప్యూటర్‌ వంటి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో లాగిన్‌ అయ్యే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..