Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio 5G: మొబైల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 50 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు

దేశంలో5జీ నెట్‌వర్క్‌ దూసుకుపోతోంది. క్రమ క్రమంగా ఈ నెట్‌వర్క్‌ మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. టెలికాం నెట్‌వర్క్‌లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. 5జీ ట్రూ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించే..

Jio 5G: మొబైల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 50 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు
Jio 5g
Follow us
Subhash Goud

|

Updated on: Jan 24, 2023 | 4:00 PM

దేశంలో5జీ నెట్‌వర్క్‌ దూసుకుపోతోంది. క్రమ క్రమంగా ఈ నెట్‌వర్క్‌ మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. టెలికాం నెట్‌వర్క్‌లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. 5జీ ట్రూ సేవలు మరిన్ని నగరాలకు విస్తరించే పనిలో ఉంది. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాల్లో జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్‌ జియో తెలిపింది. ఈ కొత్త నగరాల్లో గోవా, హర్యానా, పుదుచ్చెరి ఉన్నాయి.

కోటాలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, హర్యానా సర్కిల్‌లో ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా 184 పట్టణాలు, నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ సేవలు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని పట్టణాలు కూడా ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, కడప, రాజమహేంద్రవరంలో ఈ జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ నగరాల్లో 5జీ సేవలు అందించేది ఏకైకా టెలికాం కంపెనీ జియో.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు రిలయన్స్‌ జియో తెలిపింది , పంజాబ్ రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రతి ప్రాంతాన్ని డిజిటలైజ్ చేయాలనే మా తపనకు నిరంతర మద్దతునిస్తున్నాయని తెలిపింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 50 నగరాల్లో నిజమైన జియో 5G సేవలు అందుతున్నట్లు తెలిపింది.

కాగా, ఇది వరకు జియో ట్రూ 5జీ సేవలు తెలంగాణలోని 5 నగరాలైన హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో ఉండగా, ఇప్పుడు నల్గొండను చేర్చారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 9 నగరాలైన తిరుమల, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, కాకినాడ ఉండగా, ఇప్పుడు కొత్తగా చిత్తూరు, కడప, నర్సరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలకు ఈ జియో ట్రూ 5జీ సేవలను విస్తరించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి