ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
హాయిగా సాగుతున్న ఓ జంట కాపురంలో సోషల్ మీడియా చిచ్చురేపింది. ఇన్ స్టాలో పరిచమైన యువకుడితో ప్రేమాయనం సాగించిన భార్య.. భార్తను చంపి ప్రియుడి సాయంతో మృతదేహాన్ని మాయం చేసింది. ఆనక ఏమీ తెలియనట్లు బంధువుల ముందు భర్త కనిపించడంలేదని నాటకాలు ఆడసాగింది. కానీ పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టైంది..

హర్యాణా, ఏప్రిల్ 16: లేడీ యూట్యూబర్ ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన హరియాణాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని భివానీలో కాపురం ఉంటున్న యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ (35)లకు 2017లో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే రవీనాకు రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన యూట్యూబర్ సురేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రవీనా తరచూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది. రవీనా, ప్రియుడు సురేష్ తో కలిసి సోషల్ మీడియోలో వీడియోలు చేయడం కుటుంబంలో ఎవరికీ నచ్చేదికాదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు సైతం జరిగేవి.
భార్య వీడియోలు, రీల్స్ చూసిన భర్త ప్రవీణ్ మద్యానికి బానిపై భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మార్చి 25న రవీనా ఇంటికి సురేష్ వచ్చాడు. వీరిద్దరినీ చూసిన భర్త ప్రవీణ్‌కు ఒళ్లు మండిపోయింది. వారిని నిలదీయగా రవీనా, ప్రవీణ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదే రోజు రాత్రి రవీనా, సురేష్.. ప్రవీణ్‌ను గొంతుకోసి హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో నిందితులిద్దరూ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాల్వలో పడేశారు. సీసీటీవీ ఫుటేజీలో రవినా, సురేష్ బైక్ పై ప్రయాణిస్తున్నట్లు, వారి మధ్యలో ప్రవీణ్ మృతదేహం ఉంచి పారవేసేందుకు వెళ్తుండగా ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అనంతరం ప్రవీణ్ ఎక్కడని పలుమార్లు కుటుంబసభ్యులు ప్రశ్నించగా రవీనా పోలీకలేని సమాధానాలు చెప్పసాగింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ప్రవీణ్ కనిపించడంలేదనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన మూడు రోజుల అనంతరం పోలీసులకు కాల్వలో అతడి మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా భార్య రవీనా వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు జరిపి రవినాను తమదైన శైలిలో ప్రశ్నించగా ఆమె నేరం అంగీకరించింది. ఆమెను జైలుకు పంపించారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.