- Telugu News Photo Gallery Technology photos Boat launches 2 new smart watches in india. boAt Lunar Connect Pro and Lunar Call Pro features and features Telugu Tech News
Boat Smartwatch: బోట్ నుంచి రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లు.. బడా కంపెనీలను తలదన్నే డిజైన్, ఫీచర్లతో.
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతోంది ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థ బోట్. మరీ ముఖ్యంగా స్మార్ట్ వాచ్ సెగ్మెంట్‌లో బోట్ మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు బడ్జెట్ ధరలో స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తూ వస్తోన్న బోట్ తాజాగా ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్..
Updated on: Apr 01, 2023 | 6:03 PM

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతోంది ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థ బోట్. మరీ ముఖ్యంగా స్మార్ట్ వాచ్ సెగ్మెంట్‌లో బోట్ మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు బడ్జెట్ ధరలో స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తూ వస్తోన్న బోట్ తాజాగా ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసింది.

బడా కంపెనీలకు ధీటుగా కొత్తగా రెండు స్మార్ట్ వాచ్‌లను తీసుకొచ్చింది. లూనార్ కనెక్ట్ ప్రో, లూనార్ కాల్ ప్రో పేర్లతో లాంచ్ చేసిన స్మార్ట్ వాచ్‌లు ప్రీమియం లుక్, ఫీచర్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇంతకీ ఈ స్మార్ట్ వాచుల్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం..

లూనార్ కనెక్ట్ ప్రో ధర రూ. 10,999 కాగా లూనార్ కాల్ ప్రో ధర రూ. 6990గా ఉంది. అయితే, ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా, రెండింటినీ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ.3,499కే సొంతం చేసుకోవచ్చు. రెండు స్మార్ట్‌వాచ్‌లపై ఏడాది వారంటీ ఉంది. ఇక ఈ రెండు స్మార్ట్ వాచ్‌లను రౌండ్ మెటల్ డయల్స్‌తో రూపొందించారు. 1.39 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

యాంబియంట్ లైట్ సెన్సార్‌తో కాంతిని సర్దుబాటు చేసుకోవడం ఈ వాచ్‌ల ప్రత్యేకగా చెప్పొచ్చు. ఈ రెండు వాచ్‌ల్లో వేగవంతమైన అపోలో3 చిప్‌సెట్‌ను అందించారు. ఇంటర్నల్ హెచ్‌డీ మైక్రోఫోన్, స్పీకర్ అందించిన ఈ ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా కాలింగ్ సైతం మాట్లాడుకోవచ్చు.

ఇక ఈ రెండు స్మార్ట్ వాచ్‌ల్లో బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ASAP ఛార్జ్ టెక్నాలజీని అందించారు. దీంతో స్మార్ట్ వాచ్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 15 రోజులపాటు నిర్వీరామంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో 700కిపైగా యాక్టివ్ మోడ్‌లు అందించారు. అలాగే బ్లూటూత్ BLE v5.0తో ఈ వాచ్‌ను రూపొందించారు.





























