Telugu News » Photo gallery » Here are the best smart phones with 5000mah battery, for long lasting use, check details here
Best Battery Phones: ఈ ఫోన్లకు 10 నిమిషాలు చార్జింగ్ చాలు.. రోజంతా పనిచేస్తూనే ఉంటాయి..
Madhu |
Updated on: Apr 01, 2023 | 5:33 PM
స్మార్ట్‌ఫోన్‌లు మన దైనందిన జీవితంలో భాగం అయిపోయాయి. అది చేతిలో లేకుండా ఎక్కడికీ కదలలేని పరిస్థితికి అది మనల్ని తీసుకొచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఆన్ లో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఒకవేళ బ్యాటరీ మధ్యలో అయిపోతుందేమోనని పవర్ బ్యాంక్ లు కూడా చాలా మంది వెంట తీసుకెళ్తారు. అందుకే ఎక్కువ శాతం మంది మంచి బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లను కొనుగోలు చేయడానికి అందరూ మొగ్గుచూపుతారు. ఒకవేళ మీరు కూడా బెటర్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ల కోసం వెతుకుతున్నారా? అయితే వెతుకులాట ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లను మీ కోసం పరిచయం చేస్తున్నాం. ఈ ఫోన్లు కేవలం బ్యాటరీ సామర్థ్యం మాత్రమే కాదు, మంచి ఫీచర్లు, అదిరే లుక్, అధిక పనితీరుతో మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఆ ఫోన్లు ఏంటో ఓ సారి చూద్దాం రండి..
Apr 01, 2023 | 5:33 PM
OnePlus CE Nord 2 Lite 5G Black Dusk..
ఈ ఫోన్ యూనిక్ డిజైన్ లో ఉంటుంది. దీనిలో వెనుకవైపు 64 ఎంపీ కెమెరాతో పాటు ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.59 అంగుళాల అతి పెద్ద డిస్ ప్లే 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ తో ఉంటుంది. దీనిలో వీడియో ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి. ఫేస్ అన్ లాక్, స్క్రీన్ లాక్, స్క్రీన్ ఫ్లాష్, హెచ్డీఆర్, నైట్, పొర్ట్రైట్, టైమ్ ల్యాప్స్ వంటి అనేక ఫీచర్లు ఉంటాయి. ఇది క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 5000ఏఎంహెచ్ బ్యాటరీతో అధిక పనితీరును అందిస్తుంది. దీని ధర రూ. 18,999గా ఉంది.
1 / 5
Samsung Galaxy A14 5G Light Green
ఈ ఫోన్లో 50 ఎంపీ హై రిజల్యూషన్ రియర్ కెమెరా ఉంటుంది. 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ రీడర్, ఫేస్ అన్లాక్ తో కూడిన నాక్స్ సెక్యూరిటీ సిస్టమ్ తో ఈ ఫోన్ వస్తుంది. దీని స్క్రీన్ 6 అంగుళాలు, దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 18,999గా ఉంది.
2 / 5
Vivo Y56 Orange Engine
5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న మరో సూపర్ ఫోన్ ఇది. దీనిలో 18వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా ఉంది. దీనిలో కూడా 50 ఎంపీ సూపర్ నైట్ కెమెరా ఉంటుంది. ఆరు అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. దీనిలో మీడియా టెక్ 5జీ అల్ట్రా సేవ్ టెక్నాలజీతో బ్యాటరీ లైఫ్ ని పెంచుతుంది. ఇది కేవలం పది నిమిషాల చార్జింగ్ తో 10 గంటలపాటు పనిచేస్తుంది. దీని ధర రూ. 19,999గా ఉంది.
3 / 5
OnePlus 10R 5G Sierra Black
దీనిలో వైడ్ రేంజ్ ఫీచర్లు ఉన్నాయి. ఆకట్టుకునే డిజైన్ దీని సొంతం. 50 ఎంపీ సోనీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది. 8జీడీ ర్యామ్, 256 ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఈ ఫోన్ 10 నిమిషాలు చార్జ్ చేస్తే రోజంతా పనిచేస్తుంది. 6.7 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. కెమెరా 50 ఎంపీ కెమెరాతో ఇది వస్తోంది. దీని ధర 31,999గా ఉంది.
4 / 5
Samsung Galaxy S23 Ultra 5G
దీని డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని పర్యావరణ హితమైన వస్తువులతో తయారు చేశారు. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. దీనిలో వైడ్ యాంగిల్ 200ఎంపీ రిజల్యూషన్ కెమెరా ఉంటుంది. 6.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ సామర్థ్యంతో ఇది వస్తుంది. దీని ధర రూ. 1,24,999గా ఉంది.