మెటా యాజమాన్యంలోని ప్రసిద్ధ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. వేధింపులు, నకిలీ సమాచారాన్ని ఫార్వార్డ్ చేయడం, ఇతర వినియోగదారులను మోసం చేయడం వంటి కారణాలతో భారతదేశంలో 72 లక్షలకు పైగా ఖాతాలు గతంలో నిషేధించబడ్డాయి. మరోవైపు కొత్త ఫీచర్లను కూడా ప్రకటిస్తున్నారు.