- Telugu News Photo Gallery Technology photos Xiaomi launching Xiaomi 13T series smart phone on september 26th, check here for features and price details
Xiaomi 13T: షావోమీ నుంచి 13 సిరీస్ వచ్చేస్తోంది.. మార్కెట్లోకి రానున్న రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్లు.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షావోమీ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. షావోమీ 13 సిరీస్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. షావోమీ 13టీ, 13 టీ ప్రో పేరుతో రెండు ఫోన్‌లను తీసుకురానున్నారు. ప్రీమియం బడ్జెట్ సెగ్‌మెంట్‌లో ఈ ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 12, 2023 | 4:56 PM

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ ఈ నెల 26వ తేదీన షావోమీ 13 సిరీస్‌లో భాగంగా షావోమీ 13టీ, షావోమీ 13టీ ప్రో పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో సెప్టెంబర్ 26న లాంచ్ అవుతుండగా భారత మార్కెట్లోకి ఎప్పుడు రానుందన్న దానిపై క్లారిటీ రానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67ఇంచెస్‌తో కూడిన 144 హెజ్‌జెడ్ రిఫ్రేష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

ఇక షావోమీ 13టీ ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్ ఫుల్ బ్యాటరీని ఇవ్వనున్నారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వైఫై 802.11, జీపీఎస్, బ్లూటూత్ వీ5.30, యూఎస్‌బీ టైప్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 62,000గా ఉండొచ్చని అంచాన వేస్తున్నారు.




