- Telugu News Photo Gallery Technology photos Rs 12000 Discount on Nokia x30 5g have a look on features and price details Telugu Tech News
Nokia X30 5G: నోకియా స్మార్ట్ ఫోన్‌పై రూ. 12 వేల డిస్కౌంట్.. ఫీచర్స్ చూస్తే ఔరా అనాల్సిందే
ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్‌ను శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో మాత్రం రాణించలేక పోయింది. అయితే విండోస్ ఫోన్‌ల తర్వాత మళ్లీ స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టిన నోకియా మార్కెట్లోకి వరుస స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో నోకియా ఎక్స్ 30 పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 12 వేలు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ నోకియా ఎక్స్ 30 ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 12, 2023 | 9:38 PM

నోకియా ఎక్స్ 30 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఇటీవల లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ లాంచింగ్ సమయంలో ధర రూ. 48,999గా ఉంది. కానీ తాజాగా డిస్కౌంట్‌లో భాగంగా ఏకంగా రూ. 12 వేలు డిస్కౌంట్‌కు లభిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 36,999కి లభిస్తోంది.

నోకియా ఎక్స్ 30 5జీ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ ఈ కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1,080x2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. సెక్యూరిటీలో భాగంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లేలో అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

నోకియా ఎక్స్ 30 5జీ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4200 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. అయితే ఈ ఫోన్‌పై అందిస్తున్న డిస్కౌంట్ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందన్నదానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.





























